ఊడిగపు చెలులార వొద్దనుండి సేవించరో
(॥పల్లవి॥)
ఊడిగపు చెలులార వొద్దనుండి సేవించరో
వేడుక లన్నియు నేఁడు వెల్లి విరులాయ
(॥ఊడిగ॥)
గోవర్ధనగిరెత్తిన గోవిందుని మీఁదటను
వావిరిఁ గురిసే జడివానలవలే
ఆవేళఁ బన్నీట నభిషేకము సేయఁగ
వేవేలు దెరఁగుల విభవము లమరె
(॥ఊడిగ॥)
క్షీరాబ్దిలోపలి శ్రీవల్లభునిమీఁదట
చేరి సేసే అమృతాభిషేకమువలె
గారవానఁ జేసేటి కప్పురకాపమరెను
నేరుపులు హరికిని నిబిడము లమరె
(॥ఊడిగ॥)
చీఁకటి దెగమ్రింగిన శ్రీకృష్ణుని మీఁదటను
ఆఁకలఁ దట్టుపుణుఁగమరె నిదే
కాఁకల శ్రీవేంకటేశు కౌఁగిట నలమేల్మంగ
యేఁకటతో గూఁడ గాను యిరవాయ సిరులు
(||pallavi||)
ūḍigabu sĕlulāra vŏddanuṁḍi seviṁcharo
veḍuga lanniyu nem̐ḍu vĕlli virulāya
(||ūḍiga||)
govardhanagirĕttina goviṁduni mīm̐daḍanu
vāvirim̐ gurise jaḍivānalavale
āveḽam̐ bannīḍa nabhiṣhegamu seyam̐ga
vevelu dĕram̐gula vibhavamu lamarĕ
(||ūḍiga||)
kṣhīrābdilobali śhrīvallabhunimīm̐daḍa
seri sese amṛtābhiṣhegamuvalĕ
gāravānam̐ jeseḍi kappuragābamarĕnu
nerubulu harigini nibiḍamu lamarĕ
(||ūḍiga||)
sīm̐kaḍi dĕgamriṁgina śhrīkṛṣhṇuni mīm̐daḍanu
ām̐kalam̐ daṭṭubuṇum̐gamarĕ nide
kām̐kala śhrīveṁkaḍeśhu kaum̐giḍa nalamelmaṁga
yem̐kaḍado gūm̐ḍa gānu yiravāya sirulu