ఊడిగపు సతులాల వుండరే మీరు
(॥పల్లవి॥)
ఊడిగపు సతులాల వుండరే మీరు
ఆడరే మెల్లనిమాట లంతంత మీరు
(॥॥)
మాటలాడే రిద్దరును మాణికపుటింటిలోన
తేటలుగ దేవుఁడును దేవులు నిదె
యేటికి దగ్గరిపోయే రిదివేళగాదు మీకు
బోఁటులాల పిలిచితే పోదముగాని
(॥॥)
తూఁగుటుయ్యాల లూగేరు తొలఁకు మోహము తోడ
యేఁగివచ్చిలోని కేఁగి రింతకముందు
తోఁగిచూడకురే మీరు తొడరి తమంతనే
పాఁగి పిలిచినప్పుడే పలుకుదము
(॥॥)
యేకతాన శ్రీ వేంకటేశుఁడలమేల్మంగయుఁ
బై కొని కూడున్నవారు పానువుమీఁద
పోకురే చనవుచేసి పొలఁతు లిపుడే వారు
ఆకుమడువఁబిలిచే రప్పుడే పోదము
(||pallavi||)
ūḍigabu sadulāla vuṁḍare mīru
āḍare mĕllanimāḍa laṁtaṁta mīru
(||||)
māḍalāḍe riddarunu māṇigabuḍiṁṭilona
teḍaluga devum̐ḍunu devulu nidĕ
yeḍigi daggariboye ridiveḽagādu mīgu
bom̐ṭulāla piliside podamugāni
(||||)
tūm̐guḍuyyāla lūgeru tŏlam̐ku mohamu toḍa
yem̐givachchiloni kem̐gi riṁtagamuṁdu
tom̐gisūḍagure mīru tŏḍari tamaṁtane
pām̐gi pilisinappuḍe palugudamu
(||||)
yegadāna śhrī veṁkaḍeśhum̐ḍalamelmaṁgayum̐
bai kŏni kūḍunnavāru pānuvumīm̐da
pogure sanavusesi pŏlam̐tu libuḍe vāru
āgumaḍuvam̐bilise rappuḍe podamu