ఊడిగపు నిబ్బరాన వొరపు లెరఁగరు
(॥పల్లవి॥)
ఊడిగపు నిబ్బరాన వొరపు లెరఁగరు
తాడుపడి గోళ్లేల తాఁకించేరే మీరు
(॥॥)
పన్నీట మజ్జనమార్చి పావడలఁ దడివొత్తి
చన్నులేల తాఁకించేరే సతులాలా
తిన్ననికప్పురధూళి తిరుమేననెల్లా మెత్తి
వున్నతపుఁ గొప్పులేల వూఁదేరే మీరు
(॥॥)
తట్టుపుణుఁ గలది యంతటా మెరుఁగులు వెట్టి
చుట్టుబయ్యద లేఁటికి సోఁకించేరే
గట్టిగా సోమ్ములు వెట్టి కడుసింగారాలు సేసి
వట్టి మీ చెమటలేల వడియుంచేరే
(॥॥)
అలమేలుమంగ నురమందు నెలవుకొలిపి
యెలమి శ్రీ వేంకటేశు నేలనవ్వేరే
బలిమి నానాజాతిపండ్లు నైవేద్యమిచ్చి
అలమి మోవిండ్లవి యేమి చూపేరే
(||pallavi||)
ūḍigabu nibbarāna vŏrabu lĕram̐garu
tāḍubaḍi goḽlela tām̐kiṁchere mīru
(||||)
pannīḍa majjanamārsi pāvaḍalam̐ daḍivŏtti
sannulela tām̐kiṁchere sadulālā
tinnanigappuradhūḽi tirumenanĕllā mĕtti
vunnadabum̐ gŏppulela vūm̐dere mīru
(||||)
taṭṭubuṇum̐ galadi yaṁtaḍā mĕrum̐gulu vĕṭṭi
suṭṭubayyada lem̐ṭigi som̐kiṁchere
gaṭṭigā sommulu vĕṭṭi kaḍusiṁgārālu sesi
vaṭṭi mī sĕmaḍalela vaḍiyuṁchere
(||||)
alamelumaṁga nuramaṁdu nĕlavugŏlibi
yĕlami śhrī veṁkaḍeśhu nelanavvere
balimi nānājādibaṁḍlu naivedyamichchi
alami moviṁḍlavi yemi sūbere