Onarina sodigi volube melu

ఒనరిన చోటికి వొలుపే మేలు
Language

(॥పల్లవి॥)
ఒనరిన చోటికి వొలుపే మేలు
ననుపులు వచరించి నవ్వు నవ్వవే

(॥ఒన॥)
యింత యాలే వెగటు యిదేమే నీపగటు
అంతేసి వద్దే విరహపు సొగటు
చెంతనే విభుఁడు వచ్చి చెక్కు నొక్కి వీడె మిచ్చీ
సంతోసాన నందుకొని సంగడిఁ గూచుండవే

(॥ఒన॥)
యేఁటికే యీ సొలపు యి దేడదే యలపు
గాఁటమాయఁ గోరికల కలగలపు
యీటుతోఁ బువ్వులవేసి యీతఁడు పొందుకులాసీ
చోటిచ్చి సరసమాడి చొక్కించవే

(॥ఒన॥)
యెందాఁకానే మరఁగు యెట్టిదే నీ చెఱఁగు
మందలించరాదే నీ మతి కరఁగు
చెంది నిన్ను నింతలోనె శ్రీవేంకటేశుఁడు గూడె
చందముగా మోవితేనె చవి చూపవే

(||pallavi||)
ŏnarina soḍigi vŏlube melu
nanubulu vasariṁchi navvu navvave

(||ŏna||)
yiṁta yāle vĕgaḍu yideme nībagaḍu
aṁtesi vadde virahabu sŏgaḍu
sĕṁtane vibhum̐ḍu vachchi sĕkku nŏkki vīḍĕ michchī
saṁtosāna naṁdugŏni saṁgaḍim̐ gūsuṁḍave

(||ŏna||)
yem̐ṭige yī sŏlabu yi deḍade yalabu
gām̐ṭamāyam̐ gorigala kalagalabu
yīḍudom̐ buvvulavesi yīdam̐ḍu pŏṁdugulāsī
soḍichchi sarasamāḍi sŏkkiṁchave

(||ŏna||)
yĕṁdām̐kāne maram̐gu yĕṭṭide nī sĕṟam̐gu
maṁdaliṁcharāde nī madi karam̐gu
sĕṁdi ninnu niṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
saṁdamugā movidenĕ savi sūbave