Omti nunna navvavachchee no yammaa

ఒంటి నున్న నవ్వవచ్చీ నో యమ్మా
Language

(॥పల్లవి॥)
ఒంటి నున్న నవ్వవచ్చీ నో యమ్మా
వుంటవింట వేయుమనీ నో యమ్మ

(॥ఒంటి॥)
సుద్దు లవి విను మంటా సొరిదిఁ జెక్కులు ముట్టీ
వొద్దన్నా మానఁడే వో యమ్మా
గద్దించి యందుకు నేను కడు జంకించఁ బోతేను
వుద్దండపుమాట లాడీ నూరకే వో యమ్మా

(॥ఒంటి॥)
బడి బడి రమ్మంటాఁ బట్టఁ బట్టఁ బైకొని
వొడిసీ నీ పయ్యదను నో యమ్మా
తదవకు మని నేను తన్ను నాన వెట్టితేను
ఉడికి తప్పక చూచీ నూరకే వో యమ్మా

(॥ఒంటి॥)
పనిమాలి నేఁడే తన పాదుములు గుద్దు మంటా
వొనర బలిమి నేసీ నో యమ్మా
యెనసెను శ్రీవెంకటేశుఁ డిటువలె నన్ను
వుని కై నిలిచితిమి వూరకే వో యమ్మా

(||pallavi||)
ŏṁṭi nunna navvavachchī no yammā
vuṁṭaviṁṭa veyumanī no yamma

(||ŏṁṭi||)
suddu lavi vinu maṁṭā sŏridim̐ jĕkkulu muṭṭī
vŏddannā mānam̐ḍe vo yammā
gaddiṁchi yaṁdugu nenu kaḍu jaṁkiṁcham̐ bodenu
vuddaṁḍabumāḍa lāḍī nūrage vo yammā

(||ŏṁṭi||)
baḍi baḍi rammaṁṭām̐ baṭṭam̐ baṭṭam̐ baigŏni
vŏḍisī nī payyadanu no yammā
tadavagu mani nenu tannu nāna vĕṭṭidenu
uḍigi tappaga sūsī nūrage vo yammā

(||ŏṁṭi||)
panimāli nem̐ḍe tana pādumulu guddu maṁṭā
vŏnara balimi nesī no yammā
yĕnasĕnu śhrīvĕṁkaḍeśhum̐ ḍiḍuvalĕ nannu
vuni kai nilisidimi vūrage vo yammā