Omde laugigamoo vomde vaidigamu

ఒండె లౌకికమూ వొండె వైదికము
Language

(॥పల్లవి॥)
ఒండె లౌకికమూ వొండె వైదికము
రెండోడలఁ జాఁచ నుండునా పాదములు

(॥ఒండె॥)
తెగి మోక్షమార్గము తెరువైన దేహికి
మగిడి లొకముచింత మఱి యేల
సగము విత్తులకును సగము పాకమునకు
తగునా వొక్కటె కాయ తరిగిపెట్టినను

(॥ఒండె॥)
నలువంక దైవము నమ్మిన యట్టివారికి
మలయ మనుష్యబుద్ధి మరి యేలా
తులఁదూఁగు నొసలు బత్తుఁడు నోరు దోఁడేలు
మెలఁగిన యట్టయితే మెచ్చునా దేవుఁడు

(॥ఒండె॥)
తక్కక శ్రీవేంకటేశు దాసానుదాఁసుఁడైతే
మక్కువ నవుఁగాములు మఱి యేలా
దిక్కుల యేనుగు నెక్కి దిడ్డి దూరఁ బోతేను
వెక్కసమౌఁ గాక యిది వినసంగతి యౌనా

(||pallavi||)
ŏṁḍĕ laugigamū vŏṁḍĕ vaidigamu
rĕṁḍoḍalam̐ jām̐sa nuṁḍunā pādamulu

(||ŏṁḍĕ||)
tĕgi mokṣhamārgamu tĕruvaina dehigi
magiḍi lŏgamusiṁta maṟi yela
sagamu vittulagunu sagamu pāgamunagu
tagunā vŏkkaḍĕ kāya tarigibĕṭṭinanu

(||ŏṁḍĕ||)
naluvaṁka daivamu nammina yaṭṭivārigi
malaya manuṣhyabuddhi mari yelā
tulam̐dūm̐gu nŏsalu battum̐ḍu noru dom̐ḍelu
mĕlam̐gina yaṭṭayide mĕchchunā devum̐ḍu

(||ŏṁḍĕ||)
takkaga śhrīveṁkaḍeśhu dāsānudām̐sum̐ḍaide
makkuva navum̐gāmulu maṟi yelā
dikkula yenugu nĕkki diḍḍi dūram̐ bodenu
vĕkkasamaum̐ gāga yidi vinasaṁgadi yaunā