Ollanani maanaraadu volasi paigonaraadu

ఒల్లనని మానరాదు వొలసి పైకొనరాదు
Language

(॥పల్లవి॥)
ఒల్లనని మానరాదు వొలసి పైకొనరాదు
వెల్లవిరి ఆయ నా వేగిరపుఁదనము

(॥ఒల్ల॥)
యెవ్వరికో విన్నపము యిదివో నేము
నవ్వుతాఁ జిత్తాన నవి నాటెనో లేదో
అవ్వలఁ దమచేఁత లవి చూచుకోరు గాని
నివ్వటిల్లీ నేఁడు నా నిష్టూరపుఁదనము

(॥బల్ల॥)
యెక్కడనో చూచితిమి ఇదిగో నేము
వక్కణించి అది గానవచ్చెనో లేదో
తక్కరితమగుణాలు తాము చూచుకోరుగాని
మొక్కలమై వున్నది నాముంగోపితనము

(॥బల్ల॥)
యేమిటికో వుపచారా లిదిగో నేము
కామించి శ్రీవేంకటేశ కలదో లేదో
నీమనసులోనివెల్లా నీవెఱుఁగుదు! నాకు
నేమమాయ నిన్నుఁగూడి నివ్వెరగుఁదనము

(||pallavi||)
ŏllanani mānarādu vŏlasi paigŏnarādu
vĕllaviri āya nā vegirabum̐danamu

(||ŏlla||)
yĕvvarigo vinnabamu yidivo nemu
navvudām̐ jittāna navi nāḍĕno ledo
avvalam̐ damasem̐ta lavi sūsugoru gāni
nivvaḍillī nem̐ḍu nā niṣhṭūrabum̐danamu

(||balla||)
yĕkkaḍano sūsidimi idigo nemu
vakkaṇiṁchi adi gānavachchĕno ledo
takkaridamaguṇālu tāmu sūsugorugāni
mŏkkalamai vunnadi nāmuṁgobidanamu

(||balla||)
yemiḍigo vubasārā lidigo nemu
kāmiṁchi śhrīveṁkaḍeśha kalado ledo
nīmanasulonivĕllā nīvĕṟum̐gudu! nāgu
nemamāya ninnum̐gūḍi nivvĕragum̐danamu