ఒక్కొక్క సతినడుమ నొక్కొక్కరూపు గైకొని
(॥పల్లవి॥)
ఒక్కొక్క సతినడుమ నొక్కొక్కరూపు గైకొని
యెక్కువైతి కృష్ణా నిన్నెట్ల నమ్మేదిరా
(॥ఒక్కొ॥)
మాటలాడే వొకతెతో మళ్ళిచూచే వొకెతను
వోటలేక నవ్వునవ్వే వొకతెతోను
కూటువై గొల్లెతలము గుంపుగూడున్నార మిదే
యేఁటిది నీమోహ మిఁక నెందని నమ్మేదిరా
(॥ఒక్కొ॥)
కన్నుగీఁటే వొకతెకుఁ గాఁగిలిందే వొకతెను
వెన్నదిన్న మోవిచ్చేవు వేరోకతెకు
వున్నతి రాసక్రీడ లున్నార మిందరము
ఇన్నిటిలో నీవలపు యెందని నమ్మేదిరా
(॥ఒక్కొ॥)
తమ్మవెట్టే వొకతెకుఁ దగమెచ్చే వొకతెను
సమ్మతించఁజేశొకతెచన్ను లంటేవు
యెమ్మెల శ్రీవేంకటేశ ఇందరి మమ్ముఁ గూడితి-
విమ్ములనే నమ్మితిఁగా కెటుల నమ్మేదిరా
(||pallavi||)
ŏkkŏkka sadinaḍuma nŏkkŏkkarūbu gaigŏni
yĕkkuvaidi kṛṣhṇā ninnĕṭla nammedirā
(||ŏkkŏ||)
māḍalāḍe vŏgadĕdo maḽḽisūse vŏgĕdanu
voḍalega navvunavve vŏgadĕdonu
kūḍuvai gŏllĕdalamu guṁpugūḍunnāra mide
yem̐ṭidi nīmoha mim̐ka nĕṁdani nammedirā
(||ŏkkŏ||)
kannugīm̐ṭe vŏgadĕgum̐ gām̐giliṁde vŏgadĕnu
vĕnnadinna movichchevu verogadĕgu
vunnadi rāsakrīḍa lunnāra miṁdaramu
inniḍilo nīvalabu yĕṁdani nammedirā
(||ŏkkŏ||)
tammavĕṭṭe vŏgadĕgum̐ dagamĕchche vŏgadĕnu
sammadiṁcham̐jeśhŏgadĕsannu laṁṭevu
yĕmmĕla śhrīveṁkaḍeśha iṁdari mammum̐ gūḍidi-
vimmulane nammidim̐gā kĕḍula nammedirā