Okkaru nosina nomu vogarigi phaliyimche

ఒక్కరు నోచిన నోము వొకరికి ఫలియించె
Language

(॥పల్లవి॥)
ఒక్కరు నోచిన నోము వొకరికి ఫలియించె
నెక్కొని చూడ నిద్దరు నీదేవుళ్లే కారా

(॥॥)
మరిగి మీరిద్దరును మంచముపై నుండఁగాను
తరుణి తొంగిచూచి తలవంచెను
సరసనున్న యాపెకే చాల నీవు వలతువు
నిరతి వెలినున్నాకె నీకే వలచును

(॥॥)
కందువ మీ రిద్దరును కాఁగిలించుకుండఁగాను
చెంది వేరొకతె చూచి సిగ్గుపడెను
అంది ఆయాలంటినాపె కటు నీవు చిక్కితివి
విందువచ్చినాకె నీవేడుకకుఁ జెక్కెను

(॥॥)
పొంచి మీ రిద్దరు మోవిబువ్వపుతేనె లానఁగా
పొంచుకున్న యాకె తాను పొత్తుగూడెను
యెంచఁగ శ్రీ వేంకటేశ ఇచ్చకుఁడ వొకతెకు
నించి వేరొక్కతెయైతే నీఇచ్చలోనిది

(||pallavi||)
ŏkkaru nosina nomu vŏgarigi phaliyiṁchĕ
nĕkkŏni sūḍa niddaru nīdevuḽle kārā

(||||)
marigi mīriddarunu maṁchamubai nuṁḍam̐gānu
taruṇi tŏṁgisūsi talavaṁchĕnu
sarasanunna yābĕge sāla nīvu valaduvu
niradi vĕlinunnāgĕ nīge valasunu

(||||)
kaṁduva mī riddarunu kām̐giliṁchuguṁḍam̐gānu
sĕṁdi verŏgadĕ sūsi siggubaḍĕnu
aṁdi āyālaṁṭinābĕ kaḍu nīvu sikkidivi
viṁduvachchināgĕ nīveḍugagum̐ jĕkkĕnu

(||||)
pŏṁchi mī riddaru movibuvvabudenĕ lānam̐gā
pŏṁchugunna yāgĕ tānu pŏttugūḍĕnu
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha ichchagum̐ḍa vŏgadĕgu
niṁchi verŏkkadĕyaide nīichchalonidi