ఒక్కరిఁ గాదనలేక వూరకున్నాఁడవు నీవు
(॥పల్లవి॥)
ఒక్కరిఁ గాదనలేక వూరకున్నాఁడవు నీవు
మక్కువతో నెవ్వరిపై మనసున్నదయ్య
(॥॥)
ఇంతి నిన్నొకతె తమఇంటికిఁ బిలిచితేను
పంతాన వేరొకతె చెయివట్టి తీసీని
వంతులకు నిరుమేలా వలపులు దైవారి
పొంతల నెవ్వరితోడ పొందుసేసేవయ్య
(॥॥)
కోమలి యెకతె నీకుఁ గొప్పు గడుదువ్వితేను
వేమారుఁ బాదాలొ త్తీ వేరొక్కతె
నేమాన నెదురుబడి నెయ్యము లాసలు చూపి
చేముంచి యెవ్వరిచేత సేవగొనేవయ్యా
(॥॥)
కందువ నొకతె నిన్నుఁ గాఁగిలించి కూడితేను
సందడిఁ బెండ్లాడీని సరి నొక్కతె
ఇందులోనే కూడితివి యిద్దరి శ్రీ వేంకటేశ
విందుచెప్పి యెవ్వతెకు వీడెమిచ్చేవయ్య
(||pallavi||)
ŏkkarim̐ gādanalega vūragunnām̐ḍavu nīvu
makkuvado nĕvvaribai manasunnadayya
(||||)
iṁti ninnŏgadĕ tama̮iṁṭigim̐ bilisidenu
paṁtāna verŏgadĕ sĕyivaṭṭi tīsīni
vaṁtulagu nirumelā valabulu daivāri
pŏṁtala nĕvvaridoḍa pŏṁdusesevayya
(||||)
komali yĕgadĕ nīgum̐ gŏppu gaḍuduvvidenu
vemārum̐ bādālŏ ttī verŏkkadĕ
nemāna nĕdurubaḍi nĕyyamu lāsalu sūbi
semuṁchi yĕvvariseda sevagŏnevayyā
(||||)
kaṁduva nŏgadĕ ninnum̐ gām̐giliṁchi kūḍidenu
saṁdaḍim̐ bĕṁḍlāḍīni sari nŏkkadĕ
iṁdulone kūḍidivi yiddari śhrī veṁkaḍeśha
viṁdusĕppi yĕvvadĕgu vīḍĕmichchevayya