ఒక్కరికిఁ జెప్పరాదు వూఁకొనరాదు
(॥పల్లవి॥)
ఒక్కరికిఁ జెప్పరాదు వూఁకొనరాదు
పక్కన నేమనినాను పైఁడికత వంటిదే
(॥ఒక్క॥)
ఆరెఁ దేరె నెడమాటలాడించ మీతోనేలే
చేరి తానే యడిగితేఁ జెప్పేఁ గాని
గోర గీరితే నీరయ్యీ గుట్టుననుండనియ్యరే
మేర మీరితే నతని మెప్పించేఁ గాని
(॥ఒక్క॥)
వక్కణగా నాకుమీఁద వాసి పంపనేలే నా
దిక్కునఁ జూచితేఁ దనకే తెలిపేఁ గాని
వొక్కటంటే రెండయ్యీనూరకే వుండనియ్యరే
వెక్కసమైతేఁ దనతో వెలయించేఁగాని
(॥ఒక్క॥)
తప్పులెంచి అందరిచేఁ దగవులఁ బెట్టనేలే
యిప్పుడే యేకతమైతే యెంచేఁగాని
వుప్పు చిందినుమడయ్యీ వొనరె నుండఁగనీరే
కప్పి శ్రీ వేంకటేశుఁ గాఁగిలించేఁగాని
(||pallavi||)
ŏkkarigim̐ jĕpparādu vūm̐kŏnarādu
pakkana nemaninānu paim̐ḍigada vaṁṭide
(||ŏkka||)
ārĕm̐ derĕ nĕḍamāḍalāḍiṁcha mīdonele
seri tāne yaḍigidem̐ jĕppem̐ gāni
gora gīride nīrayyī guṭṭunanuṁḍaniyyare
mera mīride nadani mĕppiṁchem̐ gāni
(||ŏkka||)
vakkaṇagā nāgumīm̐da vāsi paṁpanele nā
dikkunam̐ jūsidem̐ danage tĕlibem̐ gāni
vŏkkaḍaṁṭe rĕṁḍayyīnūrage vuṁḍaniyyare
vĕkkasamaidem̐ danado vĕlayiṁchem̐gāni
(||ŏkka||)
tappulĕṁchi aṁdarisem̐ dagavulam̐ bĕṭṭanele
yippuḍe yegadamaide yĕṁchem̐gāni
vuppu siṁdinumaḍayyī vŏnarĕ nuṁḍam̐ganīre
kappi śhrī veṁkaḍeśhum̐ gām̐giliṁchem̐gāni