ఒక్కరికె ఇవియేల వొలపక్షమై దోఁచె
(॥పల్లవి॥)
ఒక్కరికె ఇవియేల వొలపక్షమై దోఁచె
పెక్కు విధముల నతనిఁ బెడరేఁచఁ దగదా
(॥ఒక్క॥)
సెరసంబులేకదా చవులుసేసెను రతికి
మరుతంత్రములు గదా మనసుఁ గరచె
తరతీవులె కదా తగులాయములు చేసె
తొరలించి తామె పతిఁ దోడితేఁదగదా
(॥ఒక్క॥)
యెడమాటలే కదా యెలఇంచె మమతలకు
అడియాసలేకదా యగడు సేసె
నిడుదచూవులుగదా నెయ్యములు దగిలించె
బెడయకుండఁగ విభునిఁ బిలిచితేఁ దగదా
(॥ఒక్క॥)
మొగమిచ్చలేకదా ముచ్చటలు దొరయించె
నగవు లివియేకదా నమ్మించెను
జిగి నింతలో వచ్చి శ్రీవేంకటేశుఁ డేలె
తగవుతో దిన దిన మితనిఁ గూర్చఁదగదా
(||pallavi||)
ŏkkarigĕ iviyela vŏlabakṣhamai dom̐sĕ
pĕkku vidhamula nadanim̐ bĕḍarem̐sam̐ dagadā
(||ŏkka||)
sĕrasaṁbulegadā savulusesĕnu radigi
marudaṁtramulu gadā manasum̐ garasĕ
taradīvulĕ kadā tagulāyamulu sesĕ
tŏraliṁchi tāmĕ padim̐ doḍidem̐dagadā
(||ŏkka||)
yĕḍamāḍale kadā yĕla̮iṁchĕ mamadalagu
aḍiyāsalegadā yagaḍu sesĕ
niḍudasūvulugadā nĕyyamulu dagiliṁchĕ
bĕḍayaguṁḍam̐ga vibhunim̐ bilisidem̐ dagadā
(||ŏkka||)
mŏgamichchalegadā muchchaḍalu dŏrayiṁchĕ
nagavu liviyegadā nammiṁchĕnu
jigi niṁtalo vachchi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ
tagavudo dina dina midanim̐ gūrsam̐dagadā