Okkari yemgilisottu koga raasabaduduraa

ఒక్కరి యెంగిలిసొత్తు కొక రాసపడుదురా
Language

(॥పల్లవి॥)
ఒక్కరి యెంగిలిసొత్తు కొక రాసపడుదురా
దక్కని సొమ్ములకును తానేల వచ్చీని

(॥ఒక్క॥)
పయ్యదంటి నీవు నన్నుఁ బైకొనఁగా వచ్చి యీపె
కయ్యమడువఁ దనకుఁ గలదా పని
ఇయ్యడనేకతమున యిద్దరమునుండఁగాను
దయ్యమువలె నిప్పుడు తానేల వచ్చీని

(॥ఒక్క॥)
చెంది నీవు నాతొడపై శిరసువెట్టుకుండఁగా
సందు చొచ్చి చూడనేమి సమ్మందము
సందుడివలపుల సదమదమై వుండఁగా
దందు పసురమువలె తానేల వచ్చీని

(॥ఒక్క॥)
నిగిడి శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితేను
తగునని పొగడఁగఁ దనకేమి
మొగము చూచుకొని ముచ్చట నీతో నాడఁగా
తగిలి పొట్టేలువలె తానేల వచ్చీనే

(||pallavi||)
ŏkkari yĕṁgilisŏttu kŏga rāsabaḍudurā
dakkani sŏmmulagunu tānela vachchīni

(||ŏkka||)
payyadaṁṭi nīvu nannum̐ baigŏnam̐gā vachchi yībĕ
kayyamaḍuvam̐ danagum̐ galadā pani
iyyaḍanegadamuna yiddaramunuṁḍam̐gānu
dayyamuvalĕ nippuḍu tānela vachchīni

(||ŏkka||)
sĕṁdi nīvu nādŏḍabai śhirasuvĕṭṭuguṁḍam̐gā
saṁdu sŏchchi sūḍanemi sammaṁdamu
saṁduḍivalabula sadamadamai vuṁḍam̐gā
daṁdu pasuramuvalĕ tānela vachchīni

(||ŏkka||)
nigiḍi śhrī veṁkaḍeśha nīvu nannum̐ gūḍidenu
tagunani pŏgaḍam̐gam̐ danagemi
mŏgamu sūsugŏni muchchaḍa nīdo nāḍam̐gā
tagili pŏṭṭeluvalĕ tānela vachchīne