Okkareedine vumdaraa neegu

ఒక్కరీతినే వుండరా నీకు
Language

(॥పల్లవి॥)
ఒక్కరీతినే వుండరా నీకు
మొక్కేను నాతో మొఱఁగకురా

(॥ఒక్క॥)
బెళకులమాటలు పెంచకురా నేఁ
దెలిసిన నటు తలదియ్యకురా
ములుచెనకులకే ములుగకురా
నలుగడ వికవిక నవ్వకురా

(॥ఒక్క॥)
బిరుదునఁ బెచ్చులు పెరుగకురా కడు -
బరనగుబతి మిటు పట్టకురా
తిరుగులఁ బగ సాదించకురా
యెరవులకాంతల నేఁచకురా

(॥ఒక్క॥)
వేగమె సిగ్గులు విడువకురా
వాగులకలికివి భళిభళిరా
యీగతి శ్రీవేంకటేశ్వరుఁడా నను
బోగించి కూడితివి పొందాయరా

(||pallavi||)
ŏkkarīdine vuṁḍarā nīgu
mŏkkenu nādo mŏṟam̐gagurā

(||ŏkka||)
bĕḽagulamāḍalu pĕṁchagurā nem̐
dĕlisina naḍu taladiyyagurā
mulusĕnagulage mulugagurā
nalugaḍa vigaviga navvagurā

(||ŏkka||)
birudunam̐ bĕchchulu pĕrugagurā kaḍu -
baranagubadi miḍu paṭṭagurā
tirugulam̐ baga sādiṁchagurā
yĕravulagāṁtala nem̐sagurā

(||ŏkka||)
vegamĕ siggulu viḍuvagurā
vāgulagaligivi bhaḽibhaḽirā
yīgadi śhrīveṁkaḍeśhvarum̐ḍā nanu
bogiṁchi kūḍidivi pŏṁdāyarā