ఒక్కరీతి వుండినట్టే వుండనియ్యరా నీవు
(॥పల్లవి॥)
ఒక్కరీతి వుండినట్టే వుండనియ్యరా నీవు
చక్కనుండ లేవు నేను సమ్మతించఁ జాలను
(॥ఒక్క॥)
అలిగి వుండినజాడ నటునే వుండేఁ గాని
బలిమిఁ బట్టికురా సాగిలి మొక్కేను
వెలయ నీ సుద్దు లెల్లా వినినప్పు డెల్లాను
పలుమారుఁ దాపమున బడల నేఁ జాలను
(॥ఒక్క॥)
పాసివున్నతమకానఁ బచ్చివొట్టు వెట్టుకొంటే
దోసము గట్టకురా నీ తొత్త నయ్యేను
ఆసల నెవ్వతనైనా నంటక నీ వుండ లేవు
గోసనానచేసి నిన్నుఁ గోపగించఁ జాలను
(॥ఒక్క॥)
అంతే వేడుకైతే నీ కేమైనాఁ జేసెఁ గాని
కొంత వూరకుండరా నీ కొమ్మ నయ్యేను
చెంతలఁ గూడితి నన్ను శ్రీవేంకటేశ్వర
యింతటివాడవుఁ నీకు యెదురాడఁ జాలను
(||pallavi||)
ŏkkarīdi vuṁḍinaṭṭe vuṁḍaniyyarā nīvu
sakkanuṁḍa levu nenu sammadiṁcham̐ jālanu
(||ŏkka||)
aligi vuṁḍinajāḍa naḍune vuṁḍem̐ gāni
balimim̐ baṭṭigurā sāgili mŏkkenu
vĕlaya nī suddu lĕllā vininappu ḍĕllānu
palumārum̐ dābamuna baḍala nem̐ jālanu
(||ŏkka||)
pāsivunnadamagānam̐ bachchivŏṭṭu vĕṭṭugŏṁṭe
dosamu gaṭṭagurā nī tŏtta nayyenu
āsala nĕvvadanainā naṁṭaga nī vuṁḍa levu
gosanānasesi ninnum̐ gobagiṁcham̐ jālanu
(||ŏkka||)
aṁte veḍugaide nī kemainām̐ jesĕm̐ gāni
kŏṁta vūraguṁḍarā nī kŏmma nayyenu
sĕṁtalam̐ gūḍidi nannu śhrīveṁkaḍeśhvara
yiṁtaḍivāḍavum̐ nīgu yĕdurāḍam̐ jālanu