ఒక్కరీతి నుండదోయి వో విట్ఠలా
(॥పల్లవి॥)
ఒక్కరీతి నుండదోయి వో విట్ఠలా
వుక్కువంటి నీచిత్తము వో విట్ఠలా
(॥ఒక్క॥)
పొద్దువోయి వచ్చేవు పూఁచి బాసలు సేసేవు
వొద్దన్నా మానవేల వో విట్ఠలా
కొద్దిమాలి తిరిగేవు కొంగువట్టేవు మమ్ము
వుద్దండా లేలోయి వో వివిట్ఠలా
(॥ఒక్క॥)
వెడనవ్వు నవ్వేవు వీదులెల్లా నేఁగేవు
వొడఁబాటు లింకానా వో విట్ఠలా
కడుఁబరాకయ్యేవు కదిసేవు కమ్మరాను
వొడలు మోపకు వోయి వో విట్ఠలా
(॥ఒక్క॥)
కప్పురాలు చల్లేవు కాఁగిటిలో భ్రమసేవు
వొప్పితి నీసుద్దులకే వో విట్ఠలా
యిప్పుడె శ్రీవేంకటాద్రి నిరవై కూడితి విదె
వుప్పటించఁజాల నిఁక నో విట్ఠలా
(||pallavi||)
ŏkkarīdi nuṁḍadoyi vo viṭṭhalā
vukkuvaṁṭi nīsittamu vo viṭṭhalā
(||ŏkka||)
pŏdduvoyi vachchevu pūm̐si bāsalu sesevu
vŏddannā mānavela vo viṭṭhalā
kŏddimāli tirigevu kŏṁguvaṭṭevu mammu
vuddaṁḍā leloyi vo viviṭṭhalā
(||ŏkka||)
vĕḍanavvu navvevu vīdulĕllā nem̐gevu
vŏḍam̐bāḍu liṁkānā vo viṭṭhalā
kaḍum̐barāgayyevu kadisevu kammarānu
vŏḍalu mobagu voyi vo viṭṭhalā
(||ŏkka||)
kappurālu sallevu kām̐giḍilo bhramasevu
vŏppidi nīsuddulage vo viṭṭhalā
yippuḍĕ śhrīveṁkaḍādri niravai kūḍidi vidĕ
vuppaḍiṁcham̐jāla nim̐ka no viṭṭhalā