ఒక్కమనసున నీవొద్ద నిట్టె వున్నారము
(॥పల్లవి॥)
ఒక్కమనసున నీవొద్ద నిట్టె వున్నారము
నిక్కేము మా సేవలెల్లా నీమీఁద నుండగా
(॥ఒక్క॥)
తత్తరము నేమిటికి తాలిమీ నేమిటికి
హత్తిన కూరిమిగలఆఁడువారికి
బత్తి చెప్పుకోనేల పాసి కోపగించనేల
నితైమై మాభారమెల్లా నీమీఁద నుండఁగా
(॥ఒక్క॥)
చేరి పైకొన నేఁటికి సిగ్గువడనేమిటికి
వూరకే యిచ్చకురాండ్లై వుండేవారికి
కోరి కొంగువట్టనేల కొంచి కొంచి అలయనేల
నేరుపులమాచేఁతలు నీమీఁద నుండఁగా
(॥ఒక్క॥)
మెచ్చుమెచ్చ నేమిటికి మేలమాడ నేమిటికి
హెచ్చి నిన్నుఁ గూడినట్టి ఇంటివారికి
రచ్చలశ్రీవేంకటేశ రంతులేల రాఁపులేల
నిచ్చ నీవిచ్చనబాస నీమీఁద నుండఁగా
(||pallavi||)
ŏkkamanasuna nīvŏdda niṭṭĕ vunnāramu
nikkemu mā sevalĕllā nīmīm̐da nuṁḍagā
(||ŏkka||)
tattaramu nemiḍigi tālimī nemiḍigi
hattina kūrimigalaām̐ḍuvārigi
batti sĕppugonela pāsi kobagiṁchanela
nidaimai mābhāramĕllā nīmīm̐da nuṁḍam̐gā
(||ŏkka||)
seri paigŏna nem̐ṭigi sigguvaḍanemiḍigi
vūrage yichchagurāṁḍlai vuṁḍevārigi
kori kŏṁguvaṭṭanela kŏṁchi kŏṁchi alayanela
nerubulamāsem̐talu nīmīm̐da nuṁḍam̐gā
(||ŏkka||)
mĕchchumĕchcha nemiḍigi melamāḍa nemiḍigi
hĕchchi ninnum̐ gūḍinaṭṭi iṁṭivārigi
rachchalaśhrīveṁkaḍeśha raṁtulela rām̐pulela
nichcha nīvichchanabāsa nīmīm̐da nuṁḍam̐gā