ఒక్కమాఁటి కింతేసి కోపరా నేను
(॥పల్లవి॥)
ఒక్కమాఁటి కింతేసి కోపరా నేను
వుక్కువంటిది నీ చిత్త మోపఁగా నేను
(॥ఒక్క॥)
యెట్టైనా నేనుండే యేమైనాఁ జేసేఁగాని
వొట్టి నిన్ను బాసగొన నోవరా నేను
పట్టిన పంతము లిచ్చే పలుమారు నిన్ను మెచ్చే
అట్టె నీ కెదురు మాటాడఁగ నే నోపను
(॥ఒక్క॥)
యెందుకైనా నియ్యకొనే యిఁపైన నీసతిఁదెచ్చే
వొందిలి వేగించ నంత వోపరా నేను
పందె మెంతకైనా వేసే పాదములకైనా మొక్కే
బొందిలోని మాట నీతో బొంకలేఁగా నేను
(॥ఒక్క॥)
వెరవైనా నడిగేను వేడుకకైనా నవ్వే
వొరటు నీతో నింక వోపగా నేను
యిరవై శ్రీవేంకటేశ యింతలో నన్నుఁ గూడితి-
అరమఱచి చొక్కితినా అద్దిరా నేను
(||pallavi||)
ŏkkamām̐ṭi kiṁtesi kobarā nenu
vukkuvaṁṭidi nī sitta mobam̐gā nenu
(||ŏkka||)
yĕṭṭainā nenuṁḍe yemainām̐ jesem̐gāni
vŏṭṭi ninnu bāsagŏna novarā nenu
paṭṭina paṁtamu lichche palumāru ninnu mĕchche
aṭṭĕ nī kĕduru māḍāḍam̐ga ne nobanu
(||ŏkka||)
yĕṁdugainā niyyagŏne yim̐paina nīsadim̐dĕchche
vŏṁdili vegiṁcha naṁta vobarā nenu
paṁdĕ mĕṁtagainā vese pādamulagainā mŏkke
bŏṁdiloni māḍa nīdo bŏṁkalem̐gā nenu
(||ŏkka||)
vĕravainā naḍigenu veḍugagainā navve
vŏraḍu nīdo niṁka vobagā nenu
yiravai śhrīveṁkaḍeśha yiṁtalo nannum̐ gūḍidi-
aramaṟasi sŏkkidinā addirā nenu