ఒక్కమాఁటే ఇంతయేల వోరుచుకొనేవు
(॥పల్లవి॥)
ఒక్కమాఁటే ఇంతయేల వోరుచుకొనేవు
వెక్కసపు నీ మతికి వేడుకయ్యీఁగాని
(॥ఒక్క॥)
మచ్చరము గలిగిన మాటమాటలఁ బతికి
లచ్చన నీకొనగోరిలాగు చూపవే
యెచ్చుకుందు లిద్దరిలో నేమేమి గలిగినా
పచ్చిపచ్చిరతులలోపలఁ దేరీఁగాని
(॥ఒక్క॥)
చలమెంత గలిగినా సారెసారెఁ బతికిఁ
గులుకుఁజూపులలోనే కుప్పళించవే
చెలఁగి ఇద్దరికి నెఁజెరి వెంత గలిగినా
పలుకులరసాల బచ్చిదేరీఁగాని
(॥ఒక్క॥)
ఆస లెన్నిగలిగిన నటు శ్రీవేంకటపతి
బాసలకూటములలోఁ బచరించవే
గాసి మాని మతిలోని కడమదొడమలెల్ల
సేసలతమకములో సిగ్గుదేరీఁగాని
(||pallavi||)
ŏkkamām̐ṭe iṁtayela vorusugŏnevu
vĕkkasabu nī madigi veḍugayyīm̐gāni
(||ŏkka||)
machcharamu galigina māḍamāḍalam̐ badigi
lachchana nīgŏnagorilāgu sūbave
yĕchchuguṁdu liddarilo nememi galiginā
pachchibachchiradulalobalam̐ derīm̐gāni
(||ŏkka||)
salamĕṁta galiginā sārĕsārĕm̐ badigim̐
gulugum̐jūbulalone kuppaḽiṁchave
sĕlam̐gi iddarigi nĕm̐jĕri vĕṁta galiginā
palugularasāla bachchiderīm̐gāni
(||ŏkka||)
āsa lĕnnigaligina naḍu śhrīveṁkaḍabadi
bāsalagūḍamulalom̐ basariṁchave
gāsi māni madiloni kaḍamadŏḍamalĕlla
sesaladamagamulo sigguderīm̐gāni