Okkadogade neramgagumdaa namde daamgiri

ఒక్కతొకతె నెరఁగకుండా నందె దాఁగిరి
Language

(॥పల్లవి॥)
ఒక్కతొకతె నెరఁగకుండా నందె దాఁగిరి
మొక్కలాన దాఁగిలి ముంత(మూఁత?)లాయ రతులు

(॥ఒక్క॥)
యిక్కువ జీఁకటింటిలో యిరవై నీ వుండఁగాను
గక్కన మొక్కితే వచ్చి కాఁగిటఁ గూడె
అక్కరతో వేరొక్కతె అది యెరఁగక నీఁ
వొక్కడ వున్నాఁడవంటా నొనరఁ దాఁ గూడెను

(॥ఒక్క॥)
పని సేసి వేరొకతె పానుపుపైఁ బండ వచ్చి
నినుఁ గని సంతోసాన నెప్పునఁ గూడె
తనర వేరొక్కగొల్లెత పాలు దాఁచఁగ వచ్చి
వొనర నీకాలు దొక్కి వొగి మెచ్చి కూడెను

(॥ఒక్క॥)
భూపతిచెరువుకాడఁ బొంచి శ్రీవేంకటేశ్వర
యేపున నిన్నుఁగూడినయింతులెల్లాను
లోపలనుండి గవాక్షలు దెర చితమమోముఁ
లాపొద్దె చూచుకొని యందరును నవ్విరి

(||pallavi||)
ŏkkadŏgadĕ nĕram̐gaguṁḍā naṁdĕ dām̐giri
mŏkkalāna dām̐gili muṁta(mūm̐ta?)lāya radulu

(||ŏkka||)
yikkuva jīm̐kaḍiṁṭilo yiravai nī vuṁḍam̐gānu
gakkana mŏkkide vachchi kām̐giḍam̐ gūḍĕ
akkarado verŏkkadĕ adi yĕram̐gaga nīm̐
vŏkkaḍa vunnām̐ḍavaṁṭā nŏnaram̐ dām̐ gūḍĕnu

(||ŏkka||)
pani sesi verŏgadĕ pānububaim̐ baṁḍa vachchi
ninum̐ gani saṁtosāna nĕppunam̐ gūḍĕ
tanara verŏkkagŏllĕda pālu dām̐sam̐ga vachchi
vŏnara nīgālu dŏkki vŏgi mĕchchi kūḍĕnu

(||ŏkka||)
bhūbadisĕruvugāḍam̐ bŏṁchi śhrīveṁkaḍeśhvara
yebuna ninnum̐gūḍinayiṁtulĕllānu
lobalanuṁḍi gavākṣhalu dĕra sidamamomum̐
lābŏddĕ sūsugŏni yaṁdarunu navviri