ఒక్కటికొక్కటి లంకె లొనగూడెను
(॥పల్లవి॥)
ఒక్కటికొక్కటి లంకె లొనగూడెను
చొక్కపు సతి లాగులు చూడరమ్మ చెలులు
(॥ఒక్క॥)
వుమ్మగిలు తలపోత లుల్లములో నుండఁగాను
చెమ్మఁజెమటలు గారీ చెక్కులవెంట
కమ్మమోవిఁదేనెలు కడు నిండుకొనఁగాను
తుమ్మిదకురులు వాళీఁ దొయ్యలిమోమునను
(॥ఒక్క॥)
కాఁగిటికిఁ గోరికలు కాచుకొని వుండఁగాను
మూఁగీ నిట్టూరుపులు ముక్కున నిట్టె
లోఁగక యెదురుచూపులు కన్నులనుండఁగా
చేఁగలెక్కి పులకలు చిమ్మిరేఁగీ మేనను
(॥ఒక్క॥)
నెట్టన నివ్వెరగులు నిలువున నుండఁగాను
చుట్టరికములు నోర సుద్దులాయను
ఇట్టె శ్రీవేంకటేశుఁ డింతి నేలుకొనఁగాను
దట్టమై యొప్పె రతులు తగులై చన్నులను
(||pallavi||)
ŏkkaḍigŏkkaḍi laṁkĕ lŏnagūḍĕnu
sŏkkabu sadi lāgulu sūḍaramma sĕlulu
(||ŏkka||)
vummagilu talaboda lullamulo nuṁḍam̐gānu
sĕmmam̐jĕmaḍalu gārī sĕkkulavĕṁṭa
kammamovim̐denĕlu kaḍu niṁḍugŏnam̐gānu
tummidagurulu vāḽīm̐ dŏyyalimomunanu
(||ŏkka||)
kām̐giḍigim̐ gorigalu kāsugŏni vuṁḍam̐gānu
mūm̐gī niṭṭūrubulu mukkuna niṭṭĕ
lom̐gaga yĕdurusūbulu kannulanuṁḍam̐gā
sem̐galĕkki pulagalu simmirem̐gī menanu
(||ŏkka||)
nĕṭṭana nivvĕragulu niluvuna nuṁḍam̐gānu
suṭṭarigamulu nora suddulāyanu
iṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁti nelugŏnam̐gānu
daṭṭamai yŏppĕ radulu tagulai sannulanu