Okkadi vinnabame vunnamaadamliganela

ఒక్కటి విన్నపమే వున్నమాటఁలికనేల
Language

(॥పల్లవి॥)
ఒక్కటి విన్నపమే వున్నమాటఁలికనేల
యిక్కువతో రమణుని కెరుఁగించఁ గదవే

(॥ఒక్కటి॥)
యెడమాటలాడేనంటే యోందాఁకఁ దిరుగవచ్చు
నడుమఁ దనచిత్తము నాభాగ్యము
తడయక చూచెనంటే తనివి యెంతటఁ గల్గు
చిడిముడి నాచనవు చెల్లించుమనఁగదే

(॥ఒక్కటి॥)
యెలమిఁ బెనఁగేనంటే యెంతటఁ దీరీనాస
బలిమికాఁడు తాను భావను నేను
వెలయఁ బిలిచేనంటే వేళయెట్టుగాఁ దెలిసు
తలకొని ననునిట్టే దయఁజూడమనుమీ

(॥ఒక్కటి॥)
వెఁస బెండ్లాయాడేనంటే వేడుకకు విలువేది
వనమాయఁ దా నాకు వలపు నాది
యెసగి శ్రీవేంకటేశుఁడేలే నన్ను దూరనేల
పొసఁగ నన్నిఁకనిట్టే భోగించు మనవే

(||pallavi||)
ŏkkaḍi vinnabame vunnamāḍam̐liganela
yikkuvado ramaṇuni kĕrum̐giṁcham̐ gadave

(||ŏkkaḍi||)
yĕḍamāḍalāḍenaṁṭe yoṁdām̐kam̐ dirugavachchu
naḍumam̐ danasittamu nābhāgyamu
taḍayaga sūsĕnaṁṭe tanivi yĕṁtaḍam̐ galgu
siḍimuḍi nāsanavu sĕlliṁchumanam̐gade

(||ŏkkaḍi||)
yĕlamim̐ bĕnam̐genaṁṭe yĕṁtaḍam̐ dīrīnāsa
balimigām̐ḍu tānu bhāvanu nenu
vĕlayam̐ bilisenaṁṭe veḽayĕṭṭugām̐ dĕlisu
talagŏni nanuniṭṭe dayam̐jūḍamanumī

(||ŏkkaḍi||)
vĕm̐sa bĕṁḍlāyāḍenaṁṭe veḍugagu viluvedi
vanamāyam̐ dā nāgu valabu nādi
yĕsagi śhrīveṁkaḍeśhum̐ḍele nannu dūranela
pŏsam̐ga nannim̐kaniṭṭe bhogiṁchu manave