Okkadene yaalanaa voorage neegu

ఒక్కతెనే యాలనా వూరకే నీకు
Language

(॥పల్లవి॥)
ఒక్కతెనే యాలనా వూరకే నీకు
చక్కఁగా నీనెపమున సాదించేవుగాక

(॥ఒక్క॥)
కొల్లగాఁ జెక్కు నొక్కుచు కొనగోరు నాఁటించేవు
చెల్లినంతఁ జేయవయ్య చేఁతలు నీవు
పల్లదాన నీవిది పగ సాదించుటగాక
చెల్లఁబో నామీఁద బత్తిసేయుటా నీవు

(॥ఒక్క॥)
కొంగువట్టుతానే నాకుచములు విసికేవు
అంగడి వేయవయ్య నీ వన్నిటా సిగ్గు
చెంగట నీపంత మిఁదే చేకొనవచ్చుటగాక
సంగతి నాపై వలపుచల్లుటా నీవు

(॥ఒక్క॥)
పక్కునఁ గాఁగిటఁ గూడి పలుసోఁకులు సోఁకించేవు
వెక్కసానఁ గూడవయ్య వేడుక నన్ను
మక్కువ శ్రీవేంకటేశ మమ్ము మన్నించుట గాక
తక్కక మాతోడివినోదములా యివి

(||pallavi||)
ŏkkadĕne yālanā vūrage nīgu
sakkam̐gā nīnĕbamuna sādiṁchevugāga

(||ŏkka||)
kŏllagām̐ jĕkku nŏkkusu kŏnagoru nām̐ṭiṁchevu
sĕllinaṁtam̐ jeyavayya sem̐talu nīvu
palladāna nīvidi paga sādiṁchuḍagāga
sĕllam̐bo nāmīm̐da battiseyuḍā nīvu

(||ŏkka||)
kŏṁguvaṭṭudāne nāgusamulu visigevu
aṁgaḍi veyavayya nī vanniḍā siggu
sĕṁgaḍa nībaṁta mim̐de segŏnavachchuḍagāga
saṁgadi nābai valabusalluḍā nīvu

(||ŏkka||)
pakkunam̐ gām̐giḍam̐ gūḍi palusom̐kulu som̐kiṁchevu
vĕkkasānam̐ gūḍavayya veḍuga nannu
makkuva śhrīveṁkaḍeśha mammu manniṁchuḍa gāga
takkaga mādoḍivinodamulā yivi