Okkade vinnabamu vochchemuleni maada

ఒక్కటే విన్నపము వొచ్చెములేని మాట
Language

(॥పల్లవి॥)
ఒక్కటే విన్నపము వొచ్చెములేని మాట
యెక్కువగా నిందరిలో నేలవయ్య మమ్మును

(॥ఒక్క॥)
యెగదిగఁబోసితేను యెంతేసినేరవు నీవు
జిగిఁ బనిగొనేవారిచేతిదేకాక
బిగిసి కామినులకుఁ బిండంతే నిప్పటి నీవు
యెగసక్కెములు మాని యేలవయ్య మమ్మును

(॥ఒక్క॥)
ఇచ్చకములాడితేను యేపని సేయవు నీవు
కొచ్చికొసరేటివారి కొలఁదేకాక
నిచ్చలుఁ గామినులకు నీరు కొద్ది తామెరవు
యెచ్చరిక తోడ నిఁకనేలవయ్య మమ్మును

(॥ఒక్క॥)
యియ్యకోలై నడచితే నెందరిఁ గూడవు నీవు
నెయ్యానఁ బెండ్లాడేవారి నేమమేకాక
కొయ్యవై శ్రీవేంకటేశ కూడితివి నన్నునిట్లే
యెయ్యెడఁ బూఁపలే పిందెలేలవయ్య మమ్మును

(||pallavi||)
ŏkkaḍe vinnabamu vŏchchĕmuleni māḍa
yĕkkuvagā niṁdarilo nelavayya mammunu

(||ŏkka||)
yĕgadigam̐bosidenu yĕṁtesineravu nīvu
jigim̐ banigŏnevārisedidegāga
bigisi kāminulagum̐ biṁḍaṁte nippaḍi nīvu
yĕgasakkĕmulu māni yelavayya mammunu

(||ŏkka||)
ichchagamulāḍidenu yebani seyavu nīvu
kŏchchigŏsareḍivāri kŏlam̐degāga
nichchalum̐ gāminulagu nīru kŏddi tāmĕravu
yĕchchariga toḍa nim̐kanelavayya mammunu

(||ŏkka||)
yiyyagolai naḍaside nĕṁdarim̐ gūḍavu nīvu
nĕyyānam̐ bĕṁḍlāḍevāri nemamegāga
kŏyyavai śhrīveṁkaḍeśha kūḍidivi nannuniṭle
yĕyyĕḍam̐ būm̐pale piṁdĕlelavayya mammunu