Okkade vinnabamidi vunnavellaa nemidigi

ఒక్కటే విన్నపమిది వున్నవెల్లా నేమిటికి
Language

(॥పల్లవి॥)
ఒక్కటే విన్నపమిది వున్నవెల్లా నేమిటికి
పక్కన విచ్చేయు మా కాపని గాదుసుమ్మీ

(॥॥)
తమకించినది చెలి తడవాయ నే వచ్చి
నిమిషము రాకున్న నీకే తెలుసు
చెమటలవెల్లి వారె చింతాజలధి నిండె
భ్రమసితి మిఁక మాకుఁ బనిగాదుసుమ్మీ

(॥॥)
చూపుల నున్నుది యాస సుదతిమనసు లేఁత
యేపాటి గలఁగినా నిఁక నేమౌనో
మోపులాయఁ గోరికలు ముక్కున నూర్పులు రేఁగె
పాపము పుణ్యము మా కాపని గాదుసుమ్మీ

(॥॥)
దోమతెర మీకు మాటు తొయ్యలికి వినవచ్చు
యేమాటయిన నాడు ఇఁక మమ్మంపు
సామాన శ్రీవేంకటేశ సంధించి కూడితి విట్టె
భామ మెచ్చె నిఁక మా కాపని గాదుసుమ్మీ

(||pallavi||)
ŏkkaḍe vinnabamidi vunnavĕllā nemiḍigi
pakkana vichcheyu mā kābani gādusummī

(||||)
tamagiṁchinadi sĕli taḍavāya ne vachchi
nimiṣhamu rāgunna nīge tĕlusu
sĕmaḍalavĕlli vārĕ siṁtājaladhi niṁḍĕ
bhramasidi mim̐ka māgum̐ banigādusummī

(||||)
sūbula nunnudi yāsa sudadimanasu lem̐ta
yebāḍi galam̐ginā nim̐ka nemauno
mobulāyam̐ gorigalu mukkuna nūrbulu rem̐gĕ
pābamu puṇyamu mā kābani gādusummī

(||||)
domadĕra mīgu māḍu tŏyyaligi vinavachchu
yemāḍayina nāḍu im̐ka mammaṁpu
sāmāna śhrīveṁkaḍeśha saṁdhiṁchi kūḍidi viṭṭĕ
bhāma mĕchchĕ nim̐ka mā kābani gādusummī