Okkadamte nogadanevoyi neevu

ఒక్కటంటే నొకటనేవోయి నీవు
Language

(॥పల్లవి॥)
ఒక్కటంటే నొకటనేవోయి నీవు
వొక్కటైతే మన పొందు చక్కటాయఁ గదవే

(॥ఒక్క॥)
కన్నులు చూడవోయి కడుగొప్పలు
కన్ను లట్టె వుండనీ నీ చన్నులు చూచేనే
పొన్నపువ్వు లంపవోయి పొద్దు వొద్దున
పొన్నపువ్వు లంపితేనే సన్నలఁ దెలియవే

(॥ఒక్క॥)
కతలు చెప్పవోయి కడు వినేను
కత లెఱఁగముగాని రతులు చెప్పేనే
తతులు రానియ్యవోయి దానికేమి
తతు లప్పడే వచ్చె మితులు మీరేనే

(॥ఒక్క॥)
వావి దెలుసుకో వోయి వలసితేను
వావి నేఁ దెలిసినదే మోవి యానేను
దేవుల నైతిఁగదోయి శ్రీవేంకటేశ
దేవులౌ(లు?) గాఁగానే నీసేవలు మెచ్చితినే

(||pallavi||)
ŏkkaḍaṁṭe nŏgaḍanevoyi nīvu
vŏkkaḍaide mana pŏṁdu sakkaḍāyam̐ gadave

(||ŏkka||)
kannulu sūḍavoyi kaḍugŏppalu
kannu laṭṭĕ vuṁḍanī nī sannulu sūsene
pŏnnabuvvu laṁpavoyi pŏddu vŏdduna
pŏnnabuvvu laṁpidene sannalam̐ dĕliyave

(||ŏkka||)
kadalu sĕppavoyi kaḍu vinenu
kada lĕṟam̐gamugāni radulu sĕppene
tadulu rāniyyavoyi dānigemi
tadu lappaḍe vachchĕ midulu mīrene

(||ŏkka||)
vāvi dĕlusugo voyi valasidenu
vāvi nem̐ dĕlisinade movi yānenu
devula naidim̐gadoyi śhrīveṁkaḍeśha
devulau(lu?) gām̐gāne nīsevalu mĕchchidine