Okkabaanubu meemdane vunnaara middaramu

ఒక్కపానుపు మీఁదనే వున్నార మిద్దరము
Language

(॥పల్లవి॥)
ఒక్కపానుపు మీఁదనే వున్నార మిద్దరము
పక్కన వలపు యెట్టు పంచియిచ్చేవు

(॥ఒక్క॥)
కోరి నే మాటడుగఁగ గోరనాపె వూఁదఁగాను
యీరీతినిద్దరిసంది నెట్టు చిక్కితి
నేరుపు చూతము నీవు నెరజాణఁడ వందురు
బారపువలపు యెట్టు పంచియిచ్చేవో

(॥ఒక్క॥)
నవ్వులు నే నవ్వఁగాను నాట నాపె మొక్కఁగాను
ఇవ్వల నిద్దరిసంది నెట్టు చిక్కితి
జవ్వనపువాఁడవు చతురత నేరుతువు
పవ్వళించి వలపెట్టు పంచియిచ్చేవో

(॥ఒక్క॥)
సారె మోవి నే నానఁగ చన్నుల నాపె వొత్తఁగ
యీరీతి నిద్దరిసంది నెట్టుచిక్కితి
కోరి శ్రీవేంకటేశుఁడ కూడితివి మమ్మిద్దరి
పైరులవలపు యెట్టుపంచియిచ్చేవో

(||pallavi||)
ŏkkabānubu mīm̐dane vunnāra middaramu
pakkana valabu yĕṭṭu paṁchiyichchevu

(||ŏkka||)
kori ne māḍaḍugam̐ga goranābĕ vūm̐dam̐gānu
yīrīdiniddarisaṁdi nĕṭṭu sikkidi
nerubu sūdamu nīvu nĕrajāṇam̐ḍa vaṁduru
bārabuvalabu yĕṭṭu paṁchiyichchevo

(||ŏkka||)
navvulu ne navvam̐gānu nāḍa nābĕ mŏkkam̐gānu
ivvala niddarisaṁdi nĕṭṭu sikkidi
javvanabuvām̐ḍavu sadurada neruduvu
pavvaḽiṁchi valabĕṭṭu paṁchiyichchevo

(||ŏkka||)
sārĕ movi ne nānam̐ga sannula nābĕ vŏttam̐ga
yīrīdi niddarisaṁdi nĕṭṭusikkidi
kori śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidivi mammiddari
pairulavalabu yĕṭṭubaṁchiyichchevo