ఒక్క మనసునఁ గూడి వుండరాదా
(॥పల్లవి॥)
ఒక్క మనసునఁ గూడి వుండరాదా
యిక్కడ దొల్లిటిసుద్దు లెంచనేల మీకు
(॥ఒక్క॥)
పడతిఁకి నీకును పాయకుండా బుద్ధిచెప్పే
యెడమాటలాడితిమి యిందాఁకా నేము
తడఁబాటు గాకుండా తారుకాణాలుగాను
అడియాలాలు దెచ్చితి మిప్పుడే మీకు
(॥ఒక్క॥)
దట్టపు వినయాలతోఁ దప్పులన్నీఁ దేరిచి
ఇట్టే కాఁగిలింపించితి మిద్దరి నేము
వొట్టుక సమ్మతిచేసి వొండొరులచే విడేలు
పెట్టించితి మిందరము ప్రియముతోడ మీకు
(॥ఒక్క॥)
నగవులు నగింపించి నమ్మికలు సమకూర్చి
తగవులు సేసితిమి దండనే నేము
నిగిడి శ్రీ వేంకటేశ నిన్ను నలమేల్ మంగను
మిగులా మెప్పించితిమి మేలేకద మీకు
(||pallavi||)
ŏkka manasunam̐ gūḍi vuṁḍarādā
yikkaḍa dŏlliḍisuddu lĕṁchanela mīgu
(||ŏkka||)
paḍadim̐ki nīgunu pāyaguṁḍā buddhisĕppe
yĕḍamāḍalāḍidimi yiṁdām̐kā nemu
taḍam̐bāḍu gāguṁḍā tārugāṇālugānu
aḍiyālālu dĕchchidi mippuḍe mīgu
(||ŏkka||)
daṭṭabu vinayāladom̐ dappulannīm̐ derisi
iṭṭe kām̐giliṁpiṁchidi middari nemu
vŏṭṭuga sammadisesi vŏṁḍŏrulase viḍelu
pĕṭṭiṁchidi miṁdaramu priyamudoḍa mīgu
(||ŏkka||)
nagavulu nagiṁpiṁchi nammigalu samagūrsi
tagavulu sesidimi daṁḍane nemu
nigiḍi śhrī veṁkaḍeśha ninnu nalamel maṁganu
migulā mĕppiṁchidimi melegada mīgu