Okka manasuna nitte vumdamgadave

ఒక్క మనసున నిట్టె వుండఁగదవే
Language

(॥పల్లవి॥)
ఒక్క మనసున నిట్టె వుండఁగదవే
చెక్కిటఁ జేయివెట్టక సింగారించుకొనవే

(॥ఒక్క॥)
విన్నపాలు విన్నవాఁడు వేగ నింటికి వచ్చీనే
కన్నుల నవ్వినవాఁడు కరుచించీనే
సన్నలు సేసినవాఁడు సరసములాడినే
యెన్నఁగరానిసగినాలు యెందాఁకఁ జూచేవే

(॥ఒక్క॥)
కానుకందుకోన్నవాఁడు కడు నిన్ను మన్నీంచీనే
పూసి కెఱిఁగినవాఁడు బుజ్జగించీనే
తానే ఇయ్యకొన్నవాఁడు తగిలి కాఁగిలించీనే
తానకమై సగినా లెందాఁకాఁ జూచేవే

(॥ఒక్క॥)
విందులియ్యకొన్నవాఁడు వేడుక నీకుఁ జేసీనే
చెంది వాకిట నున్నవాఁడు చేరి నవ్వీనే
అందపు శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
ఇందుల నిన్నేలె సగినా లెందాఁకాఁ జూచేవే

(||pallavi||)
ŏkka manasuna niṭṭĕ vuṁḍam̐gadave
sĕkkiḍam̐ jeyivĕṭṭaga siṁgāriṁchugŏnave

(||ŏkka||)
vinnabālu vinnavām̐ḍu vega niṁṭigi vachchīne
kannula navvinavām̐ḍu karusiṁchīne
sannalu sesinavām̐ḍu sarasamulāḍine
yĕnnam̐garānisaginālu yĕṁdām̐kam̐ jūseve

(||ŏkka||)
kānugaṁdugonnavām̐ḍu kaḍu ninnu mannīṁchīne
pūsi kĕṟim̐ginavām̐ḍu bujjagiṁchīne
tāne iyyagŏnnavām̐ḍu tagili kām̐giliṁchīne
tānagamai saginā lĕṁdām̐kām̐ jūseve

(||ŏkka||)
viṁduliyyagŏnnavām̐ḍu veḍuga nīgum̐ jesīne
sĕṁdi vāgiḍa nunnavām̐ḍu seri navvīne
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavu nīvu
iṁdula ninnelĕ saginā lĕṁdām̐kām̐ jūseve