Okka manasuna nannu numda neeraadaa

ఒక్క మనసున నన్ను నుండ నీరాదా
Language

(॥పల్లవి॥)
ఒక్క మనసున నన్ను నుండ నీరాదా
చిక్కులేల వేసేపు చెయ్యాల పట్టేవు

(॥ఒక్క॥)
సారె నాపయ్యద వట్టి జవ్వనము రేఁచి రేఁచి
వూరకున్న వారి నేల వుడికించేవు
కూరిమి మరవనీవు కూడియుఁ గూడవు నీవు
నేరనివారిపై నేల నెపాలు వేసేవు

(॥ఒక్క॥)
వేసాన నన్ను నవ్వించి వెడ్డువెట్టి పలికించి
ఆసల నన్నేల వుస్సు రనిపించేవు
చేసేవు మంచితనాలు చిక్కియుఁ జిక్కవు నీవు
రాసిగొల్లవారి నేల రాఁపులఁ బెట్టేవు

(॥ఒక్క॥)
కన్నులఁ జూపించుకొని కాఁగిటనే కూడి కూడి
కన్నచోనే మమ్ము నేల కరఁగించేవు
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి చేఁతలనే
కన్నలైనవారి నేల కతల ముంచేవు

(||pallavi||)
ŏkka manasuna nannu nuṁḍa nīrādā
sikkulela vesebu sĕyyāla paṭṭevu

(||ŏkka||)
sārĕ nābayyada vaṭṭi javvanamu rem̐si rem̐si
vūragunna vāri nela vuḍigiṁchevu
kūrimi maravanīvu kūḍiyum̐ gūḍavu nīvu
neranivāribai nela nĕbālu vesevu

(||ŏkka||)
vesāna nannu navviṁchi vĕḍḍuvĕṭṭi paligiṁchi
āsala nannela vussu ranibiṁchevu
sesevu maṁchidanālu sikkiyum̐ jikkavu nīvu
rāsigŏllavāri nela rām̐pulam̐ bĕṭṭevu

(||ŏkka||)
kannulam̐ jūbiṁchugŏni kām̐giḍane kūḍi kūḍi
kannasone mammu nela karam̐giṁchevu
yinniḍā śhrīveṁkaḍeśha yelidivi sem̐talane
kannalainavāri nela kadala muṁchevu