ఒక్క మనసుగా నీకె వొడబాటయ్యీఁ గాని
(॥పల్లవి॥)
ఒక్క మనసుగా నీకె వొడబాటయ్యీఁ గాని
అక్కరతోడుతఁ గడు నండకు రావయ్యా
(॥ఒక్క॥)
చెలియసిగ్గులకును చెక్కిటి చేయిమాటు సాక్షి
లలి సంతోసాలకు పులకలే సాక్షి
చలివేఁడి ఆనలకు సన్నపు నవ్వులు సాక్షి
చలమేల మా మాటకు సరిచూచుకోవయ్యా
(॥ఒక్క॥)
నెట్టుకొన్నకాఁకలకు నివ్వెరగులే సాక్షి
చిట్టకపు చింతకు చెమటే సాక్షి
దట్టపువలపులకు తడఁబాటే సాక్షి
గట్టిగా మామాట తారుకాణ చూచుకోవయ్యా
(॥ఒక్క॥)
తీరనికరఁగులకు తేటలచూపులు సాక్షి
మేరతోడిపొందులకు మెచ్చులే సాక్షి
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి కాంత నిట్టె
సారపు మామాటల నిజము చూచుకోవయ్యా
(||pallavi||)
ŏkka manasugā nīgĕ vŏḍabāḍayyīm̐ gāni
akkaradoḍudam̐ gaḍu naṁḍagu rāvayyā
(||ŏkka||)
sĕliyasiggulagunu sĕkkiḍi seyimāḍu sākṣhi
lali saṁtosālagu pulagale sākṣhi
salivem̐ḍi ānalagu sannabu navvulu sākṣhi
salamela mā māḍagu sarisūsugovayyā
(||ŏkka||)
nĕṭṭugŏnnagām̐kalagu nivvĕragule sākṣhi
siṭṭagabu siṁtagu sĕmaḍe sākṣhi
daṭṭabuvalabulagu taḍam̐bāḍe sākṣhi
gaṭṭigā māmāḍa tārugāṇa sūsugovayyā
(||ŏkka||)
tīranigaram̐gulagu teḍalasūbulu sākṣhi
meradoḍibŏṁdulagu mĕchchule sākṣhi
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi kāṁta niṭṭĕ
sārabu māmāḍala nijamu sūsugovayyā