ఒక్క మనసుతో నన్ను నుండనీయరా
(॥పల్లవి॥)
ఒక్క మనసుతో నన్ను నుండనీయరా
యెక్కువ తక్కువ చేఁత లేమిటికి నాకు
(॥ఒక్క॥)
పంతము నీతోనాడి పంచబాణములకోడి
చింతతో నీమోము చూడ సిగ్గయ్యీ నాకు
కొంతగొంత మొదలనే గుట్టుననుండేదానఁ
నింతేసి సందులు దూరనేమిటికి నాకు
(॥ఒక్క॥)
యిప్పటికి నిన్ను మెచ్చి యెడసితేఁ గడుఁగొచ్చి
చిప్పిల నీతో నవ్వ సిగ్గయ్యీ నాకు
తప్పక బొంకక నేనే తాలిమితోనుండేదాన
యిప్పుడింతేశనుమానాలేమిటికి నాకు
(॥ఒక్క॥)
నెఱి నీపైఁ జెయి వేసి నిద్దరకన్నులు మూసి
చెఱఁగు వట్టి తియ్యఁగ సిగ్గయ్యీ నాకు
నెఱవై శ్రీవేంకటేశ నీవె నన్నుఁ గూడితివి
యెఱుకలు మఱవులు యేమిటికి నాకు
(||pallavi||)
ŏkka manasudo nannu nuṁḍanīyarā
yĕkkuva takkuva sem̐ta lemiḍigi nāgu
(||ŏkka||)
paṁtamu nīdonāḍi paṁchabāṇamulagoḍi
siṁtado nīmomu sūḍa siggayyī nāgu
kŏṁtagŏṁta mŏdalane guṭṭunanuṁḍedānam̐
niṁtesi saṁdulu dūranemiḍigi nāgu
(||ŏkka||)
yippaḍigi ninnu mĕchchi yĕḍasidem̐ gaḍum̐gŏchchi
sippila nīdo navva siggayyī nāgu
tappaga bŏṁkaga nene tālimidonuṁḍedāna
yippuḍiṁteśhanumānālemiḍigi nāgu
(||ŏkka||)
nĕṟi nībaim̐ jĕyi vesi niddaragannulu mūsi
sĕṟam̐gu vaṭṭi tiyyam̐ga siggayyī nāgu
nĕṟavai śhrīveṁkaḍeśha nīvĕ nannum̐ gūḍidivi
yĕṟugalu maṟavulu yemiḍigi nāgu