ఓజతో నుండినవారి కొకటొకటె రేఁచేవు
(॥పల్లవి॥)
ఓజతో నుండినవారి కొకటొకటె రేఁచేవు
రాజవైతేనే మమ్ము రవ్వసేయవలెనా
(॥ఓజ॥)
అప్పటికప్పటికి నీ వనుచరించేవుగాక
యెప్పుడును ఇంటికి నీ విట్టే వచ్చేవా
వొప్పగువేవేలుసతు లొద్దనే వుండఁగాను
చప్పనైకాక సతులు సరకయ్యేరా
(॥ఓజ॥)
బాసదప్పీనంటా నాతోఁ బైకొని నవ్వేవుగాక
ఆసల నేపొద్దూ నిట్టె ఆదరించేవా
రాసికెక్క ఇరుమేలా రామలు కొల్వుసేయఁగా
వేసటేకాక రతులు వెలవెట్టీనా
(॥ఓజ॥)
దయదలఁచేమో నన్ను తతిఁ గూడితివిగాక
ప్రియము లిట్టే నీకు పెనగొనీనా
నియతి శ్రీవేంకటేశ నేనే నీయండ నుండఁగా
జయమేగాక మేలు చండివడీనా
(||pallavi||)
ojado nuṁḍinavāri kŏgaḍŏgaḍĕ rem̐sevu
rājavaidene mammu ravvaseyavalĕnā
(||oja||)
appaḍigappaḍigi nī vanusariṁchevugāga
yĕppuḍunu iṁṭigi nī viṭṭe vachchevā
vŏppaguvevelusadu lŏddane vuṁḍam̐gānu
sappanaigāga sadulu saragayyerā
(||oja||)
bāsadappīnaṁṭā nādom̐ baigŏni navvevugāga
āsala nebŏddū niṭṭĕ ādariṁchevā
rāsigĕkka irumelā rāmalu kŏlvuseyam̐gā
vesaḍegāga radulu vĕlavĕṭṭīnā
(||oja||)
dayadalam̐semo nannu tadim̐ gūḍidivigāga
priyamu liṭṭe nīgu pĕnagŏnīnā
niyadi śhrīveṁkaḍeśha nene nīyaṁḍa nuṁḍam̐gā
jayamegāga melu saṁḍivaḍīnā