ఓహో డేండేం వొగి బ్రహ్మమిదియని
(॥పల్లవి॥)
ఓహో డేండేం వొగి బ్రహ్మమిదియని
సాహసమున శ్రుతి చాటెడిని
(॥ఓహో॥)
పరమును నపరముఁ బ్రకృతియు ననఁగా
వెరవు దెలియుటే వివేకము
పరము దేవుఁడును అపరము జీవుఁడు
తిరమైన ప్రకృతియె దేహము
(॥ఓహో॥)
జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును
పూని తెలియుటే యోగము
జ్ఞానము దేహాత్మ జ్ఞేయము పరమాత్మ
జ్ఞాన గమ్యమే సాధించు మనసు
(॥ఓహో॥)
క్షరము నక్షరమును సాక్షి పురుషుఁడని
సరవిఁ దెలియుటే సాత్వికము
క్షరము ప్రపంచ మక్షరము కూటస్థుఁడు
సిరి పురుషోత్తముఁడే శ్రీవేంకటేశుఁడు
(||pallavi||)
oho ḍeṁḍeṁ vŏgi brahmamidiyani
sāhasamuna śhrudi sāḍĕḍini
(||oho||)
paramunu nabaramum̐ brakṛtiyu nanam̐gā
vĕravu dĕliyuḍe vivegamu
paramu devum̐ḍunu abaramu jīvum̐ḍu
tiramaina prakṛtiyĕ dehamu
(||oho||)
jñānamu jñeyamu jñānagamyamunu
pūni tĕliyuḍe yogamu
jñānamu dehātma jñeyamu paramātma
jñāna gamyame sādhiṁchu manasu
(||oho||)
kṣharamu nakṣharamunu sākṣhi puruṣhum̐ḍani
saravim̐ dĕliyuḍe sātvigamu
kṣharamu prabaṁcha makṣharamu kūḍasthum̐ḍu
siri puruṣhottamum̐ḍe śhrīveṁkaḍeśhum̐ḍu