(॥పల్లవి॥)
ఒకరొకరి మనసు లొక్కటాయను
మొకమొకములు చూచి ముచ్చటాడినట్లు
(॥ఒక॥)
మానినినవ్విననవ్వు మరునిబాణపుబూవు
సానదీరి పతి కొక్కసరి వచ్చెను
ఆనకమై మారుకుమా రాతనిచూపులు ఇంతి-
కోనలకుచము లందే గురిదాఁకినట్లు
(॥ఒక॥)
వనితయాడినమాట వంచినపూఁదేనెవూఁట
ఘనుని కొక్కటి తారుకాణాయను
వెనుకొని యంతలోనె విభునిమొక్కులు అతి -
వినయము లచ్చోనే వియ్యమందినట్లు
(॥ఒక॥)
చెలియత త్తరములు చేఁతలబిత్తరములు
యిల శ్రీవేంకటపతి కితవాయను
యెలమిని సతిరతి యితనికాఁగిటిలో
కలకాలమును నట్టె కాణాచైనట్లు
(||pallavi||)
ŏgarŏgari manasu lŏkkaḍāyanu
mŏgamŏgamulu sūsi muchchaḍāḍinaṭlu
(||ŏga||)
mānininavvinanavvu marunibāṇabubūvu
sānadīri padi kŏkkasari vachchĕnu
ānagamai mārugumā rādanisūbulu iṁti-
konalagusamu laṁde guridām̐kinaṭlu
(||ŏga||)
vanidayāḍinamāḍa vaṁchinabūm̐denĕvūm̐ṭa
ghanuni kŏkkaḍi tārugāṇāyanu
vĕnugŏni yaṁtalonĕ vibhunimŏkkulu adi -
vinayamu lachchone viyyamaṁdinaṭlu
(||ŏga||)
sĕliyada ttaramulu sem̐talabittaramulu
yila śhrīveṁkaḍabadi kidavāyanu
yĕlamini sadiradi yidanigām̐giḍilo
kalagālamunu naṭṭĕ kāṇāsainaṭlu