Ogarim dadavidenu voruduraa

ఒకరిఁ దడవితేను వోరుతురా
Language

(॥పల్లవి॥)
ఒకరిఁ దడవితేను వోరుతురా
మొకము చూడఁగానే మొరతురుగాక

(॥ఒక॥)
చేతనొడ్డించుకోఁగానే చెలిని పువ్వుల వేసే
వేతుల కిందరిలోన నిదేమయ్యా
కాతరించి యాపె నిన్నుఁ గసరుచుఁ దిట్టఁగాను
నీతరుణులెల్లాఁ జూచి నిన్ను నవ్వే రిదివో

(॥ఒక॥)
సిగ్గుతోడఁ గొంకఁగానే చెనకుచు కొనగోర
అగ్గలమై చన్నులంటే వదేమయ్యా
బెగ్గిల నాపె నపేదవి గంటి సేయఁగా
నిగ్గుల నీవనితలు నిన్ను నవ్వే రదివో

(॥ఒక॥)
అలమేలుమంగ వచ్చె ననఁగానో కొంగువట్టే
వెలమి శ్రీవేంకటేశ యేమయ్యా
కలసి ఆపె నిన్నుఁ గళలంటి చొక్కించఁగా
నెలకొన్న కాంతలెల్ల నిన్ను నవ్వే రదివో

(||pallavi||)
ŏgarim̐ daḍavidenu vorudurā
mŏgamu sūḍam̐gāne mŏradurugāga

(||ŏga||)
sedanŏḍḍiṁchugom̐gāne sĕlini puvvula vese
vedula kiṁdarilona nidemayyā
kādariṁchi yābĕ ninnum̐ gasarusum̐ diṭṭam̐gānu
nīdaruṇulĕllām̐ jūsi ninnu navve ridivo

(||ŏga||)
siggudoḍam̐ gŏṁkam̐gāne sĕnagusu kŏnagora
aggalamai sannulaṁṭe vademayyā
bĕggila nābĕ nabedavi gaṁṭi seyam̐gā
niggula nīvanidalu ninnu navve radivo

(||ŏga||)
alamelumaṁga vachchĕ nanam̐gāno kŏṁguvaṭṭe
vĕlami śhrīveṁkaḍeśha yemayyā
kalasi ābĕ ninnum̐ gaḽalaṁṭi sŏkkiṁcham̐gā
nĕlagŏnna kāṁtalĕlla ninnu navve radivo