Ogari kogaru daabu vobanamtem bodu yimka

ఒకరి కొకరు దాపు వోపనంటేఁ బోదు యిఁక
Language

(॥పల్లవి॥)
ఒకరి కొకరు దాపు వోపనంటేఁ బోదు యిఁక
వెకలి చన్నీళ్లకు వేనీళ్లు దోడు

(॥ఒక॥)
ఆడరానిమాట లాడి ఆపె నీకుఁ జెప్పెంపఁగా
నీడ నీవు వూరకుండే దిది యేఁటిది
వీడనాఁడ జాలని వెరపు నీకుఁ గలితే
తోడు వచ్చే నే నీకు దోసముగా దిందుకు

(॥ఒక॥)
వొరటుగాఁ జూపి మోపి వుంట వింట వేయఁగాను
సొరిది చేత నొడ్డించుకొననేలా
ధరలోన నీకింత మొగదాకిరి గలితే
తొరల నే యెచ్చరించే దోసముగా దిందుకు

(॥ఒక॥)
గొబ్బనఁ దాలేచివచ్చి కొంగువట్టి తియ్యఁగాను
సిబ్బితి పడేవు యింకాఁ జెల్లఁబో నీవు
గబ్బితనము లేకుంటే గక్కన శ్రీ వేంకటేశ
దొబ్బే నిన్ను నాపె మీఁద దోసముగా దిందుకు

(||pallavi||)
ŏgari kŏgaru dābu vobanaṁṭem̐ bodu yim̐ka
vĕgali sannīḽlagu venīḽlu doḍu

(||ŏga||)
āḍarānimāḍa lāḍi ābĕ nīgum̐ jĕppĕṁpam̐gā
nīḍa nīvu vūraguṁḍe didi yem̐ṭidi
vīḍanām̐ḍa jālani vĕrabu nīgum̐ galide
toḍu vachche ne nīgu dosamugā diṁdugu

(||ŏga||)
vŏraḍugām̐ jūbi mobi vuṁṭa viṁṭa veyam̐gānu
sŏridi seda nŏḍḍiṁchugŏnanelā
dharalona nīgiṁta mŏgadāgiri galide
tŏrala ne yĕchchariṁche dosamugā diṁdugu

(||ŏga||)
gŏbbanam̐ dālesivachchi kŏṁguvaṭṭi tiyyam̐gānu
sibbidi paḍevu yiṁkām̐ jĕllam̐bo nīvu
gabbidanamu leguṁṭe gakkana śhrī veṁkaḍeśha
dŏbbe ninnu nābĕ mīm̐da dosamugā diṁdugu