ఒకరాస పడితే నీవొకరికిఁ జేచాఁచేవు
(॥పల్లవి॥)
ఒకరాస పడితే నీవొకరికిఁ జేచాఁచేవు
యెకసక్కీఁడవు నిన్ను నేమందునయ్యా
(॥॥)
కలువకన్నుల నిన్నుఁ గలకంటి చూచితే
నలిరేఁగి నీవిట్టే నన్నుఁ జూచేవు
మొలక చన్నుల నాపె ముంచి నిన్ను నంటించితే
కొలఁది నన్ను నీ కొనగొర నంటించేవు
(॥॥)
మగిడి మగిడి యాపె మాట నీతో నాడితేను
బగివాయకిటు నన్నుఁ బలికించేవు
నగవులాపె నీతో నవ్వితేను నీవు నా
మొగమై పకపకన ముంచి నవ్వేవు
(॥॥)
అలమేల్మంగ నీ వురమట్టే యెక్కుకొంటేను
నెలకొని నావురము నీవెక్కితివి
యెలమి నే శ్రీవేంకటేశ భూరమణిని
యిలనాపె కుడినుంటే యెడమ నన్నుంచితి
(||pallavi||)
ŏgarāsa paḍide nīvŏgarigim̐ jesām̐sevu
yĕgasakkīm̐ḍavu ninnu nemaṁdunayyā
(||||)
kaluvagannula ninnum̐ galagaṁṭi sūside
nalirem̐gi nīviṭṭe nannum̐ jūsevu
mŏlaga sannula nābĕ muṁchi ninnu naṁṭiṁchide
kŏlam̐di nannu nī kŏnagŏra naṁṭiṁchevu
(||||)
magiḍi magiḍi yābĕ māḍa nīdo nāḍidenu
bagivāyagiḍu nannum̐ baligiṁchevu
nagavulābĕ nīdo navvidenu nīvu nā
mŏgamai pagabagana muṁchi navvevu
(||||)
alamelmaṁga nī vuramaṭṭe yĕkkugŏṁṭenu
nĕlagŏni nāvuramu nīvĕkkidivi
yĕlami ne śhrīveṁkaḍeśha bhūramaṇini
yilanābĕ kuḍinuṁṭe yĕḍama nannuṁchidi