Ogadumdamgaanu verogadi sesevu neevu

ఒకటుండఁగాను వేరొకటి సేసేవు నీవు
Language

(॥పల్లవి॥)
ఒకటుండఁగాను వేరొకటి సేసేవు నీవు
ప్రకటించి వింతవారు పైపై నిన్నాడరా

(॥ఒక॥)
నానఁబెట్టి నానఁబెట్టి నాతో మాఁటలాడేవు
కానుకిచ్చినట్టియాపె కాచుకుండఁగా
వూనినవలపులతో వొడివట్టి పెనఁగేవు
మేనుమేనుసోఁక(కి?) నాపె మెరసివుండఁగాను

(॥ఒక॥)
చిడుముడితోడుత చేఇవట్టి తీసేవు
కడుఁబాదాలొత్తేయాపె కాచుకుండఁగా
వడియుఁజెమటలతో వలపులు చల్లేవు
బడిబడినున్న యాపె బాఁతిపడఁగా

(॥ఒక॥)
నమ్మించి శ్రీవేంకటేశ నన్ను నిట్టె యేలేవు
రొమ్ము మీఁదనున్న యాపె రుచులియ్యఁగా
చిమ్ముచు మోవితేనెలు సేనలుగాఁ జిందేవు
రమ్మనిపిలిచినాపె రతియియ్యఁగాను

(||pallavi||)
ŏgaḍuṁḍam̐gānu verŏgaḍi sesevu nīvu
pragaḍiṁchi viṁtavāru paibai ninnāḍarā

(||ŏga||)
nānam̐bĕṭṭi nānam̐bĕṭṭi nādo mām̐ṭalāḍevu
kānugichchinaṭṭiyābĕ kāsuguṁḍam̐gā
vūninavalabulado vŏḍivaṭṭi pĕnam̐gevu
menumenusom̐ka(ki?) nābĕ mĕrasivuṁḍam̐gānu

(||ŏga||)
siḍumuḍidoḍuda seivaṭṭi tīsevu
kaḍum̐bādālŏtteyābĕ kāsuguṁḍam̐gā
vaḍiyum̐jĕmaḍalado valabulu sallevu
baḍibaḍinunna yābĕ bām̐tibaḍam̐gā

(||ŏga||)
nammiṁchi śhrīveṁkaḍeśha nannu niṭṭĕ yelevu
rŏmmu mīm̐danunna yābĕ rusuliyyam̐gā
simmusu movidenĕlu senalugām̐ jiṁdevu
rammanibilisinābĕ radiyiyyam̐gānu