Ogadogadigi maada vonagoodene

ఒకటొకటికి మాట వొనగూడెనే
Language

(॥పల్లవి॥)
ఒకటొకటికి మాట వొనగూడెనే
వొకటి కినుమడౌరా వుప్పొలికితేను

(॥॥)
మఱచితినే మేను మంచినీమాటలకే
మఱవక బోయపగా మముబోఁటికి
కరఁగెనే నామనసు కాయము నిన్నుసోఁకితే
కరఁగఁ గరఁగ వన్నె కనకమౌఁ గదరా

(॥॥)
విడువఁజమ్మీ నీవేడుకపొందు
విడువ ముడువ నేమి విసమా ఇది
కడిగినట్టు చెమట గారె నామేను
కడుగఁగడుగ రొంపి కడచోట నీకు

(॥॥)
చిగిరించెఁ బులకలు చెక్కుల నాకు
చిగురుఁగొమ్ము చేఁగె చెప్పితే నిన్ను
తగిలితి శ్రీ వేంకటోత్తముఁడ నిన్ను
తగులువిరికూటములు తార్కాణ నాకు

(||pallavi||)
ŏgaḍŏgaḍigi māḍa vŏnagūḍĕne
vŏgaḍi kinumaḍaurā vuppŏligidenu

(||||)
maṟasidine menu maṁchinīmāḍalage
maṟavaga boyabagā mamubom̐ṭigi
karam̐gĕne nāmanasu kāyamu ninnusom̐kide
karam̐gam̐ garam̐ga vannĕ kanagamaum̐ gadarā

(||||)
viḍuvam̐jammī nīveḍugabŏṁdu
viḍuva muḍuva nemi visamā idi
kaḍiginaṭṭu sĕmaḍa gārĕ nāmenu
kaḍugam̐gaḍuga rŏṁpi kaḍasoḍa nīgu

(||||)
sigiriṁchĕm̐ bulagalu sĕkkula nāgu
sigurum̐gŏmmu sem̐gĕ sĕppide ninnu
tagilidi śhrī veṁkaḍottamum̐ḍa ninnu
taguluvirigūḍamulu tārgāṇa nāgu