Ogadogade gadimche vooragunna yaage meemda

ఒకటొకటే గడించే వూరకున్న యాకె మీఁద
Language

(॥పల్లవి॥)
ఒకటొకటే గడించే వూరకున్న యాకె మీఁద
యెకసక్యా లిఁకనేల యెరుఁగుదుమయ్యా

(॥ఒక॥)
సరుసకు వచ్చెనంటా చన్నులు సోఁకించెనంటా
తరుణిపై గోరేల తాఁకించేవు
మరిగి యాపెపై నీకు మనసువారితేను
వరుసతోఁ బెండ్లాడఁగా వద్దనీనా నిన్నును

(॥ఒక॥)
పెడమళ్ళి చూచెనంటా పెద్దకొప్పు వెట్టెనంటా
పడఁతిపై నేఁటికి నెపాలు వేసేవు
వడిగా నీ కాపెమీఁద వలపు గలిగితేను
వొడిగట్టి తియ్యఁగాను వోపననీనా

(॥ఒక॥)
నిన్నుఁ జూచి నవ్వెనంటా నిలుచుండిమొక్కెనంటా
కన్నె నేల పట్టి తీసి కాఁగిలించేవు
యెన్నఁగ శ్రీవేంకటేశ యేలితి వీకె నింతైతే
సన్నల నింకాఁ గూడఁగా చాలు ననఁగలదా

(||pallavi||)
ŏgaḍŏgaḍe gaḍiṁche vūragunna yāgĕ mīm̐da
yĕgasakyā lim̐kanela yĕrum̐gudumayyā

(||ŏga||)
sarusagu vachchĕnaṁṭā sannulu som̐kiṁchĕnaṁṭā
taruṇibai gorela tām̐kiṁchevu
marigi yābĕbai nīgu manasuvāridenu
varusadom̐ bĕṁḍlāḍam̐gā vaddanīnā ninnunu

(||ŏga||)
pĕḍamaḽḽi sūsĕnaṁṭā pĕddagŏppu vĕṭṭĕnaṁṭā
paḍam̐tibai nem̐ṭigi nĕbālu vesevu
vaḍigā nī kābĕmīm̐da valabu galigidenu
vŏḍigaṭṭi tiyyam̐gānu vobananīnā

(||ŏga||)
ninnum̐ jūsi navvĕnaṁṭā nilusuṁḍimŏkkĕnaṁṭā
kannĕ nela paṭṭi tīsi kām̐giliṁchevu
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yelidi vīgĕ niṁtaide
sannala niṁkām̐ gūḍam̐gā sālu nanam̐galadā