ఒకటొక టింక నాకు నుడువవలసె
(॥పల్లవి॥)
ఒకటొక టింక నాకు నుడువవలసె
మొకమిచ్చమాటలకు మొదలుకొనవలసె
(॥ఒక॥)
అతనితో నేఁడు నే నలిగి వుండఁగఁగదా
వెతఁబొంది మదనునికి వెఱవవలసె
తతి నంతలో విభుఁని దలపోయఁగాఁగదా
మతిఁ గరఁగి నామేను మఱపందవలసె
(॥ఒక॥)
విరహతాపపు(ము?) వెదవెట్టఁ బొరలఁగఁగదా
గరిమనాచెలులతోఁ గసరవలసె
జరసి నాతమకములు చలముకొనఁగాఁ గదా
సిరులఁ బతి పంతములు చెల్లించవలెసె
(॥ఒక॥)
పెనఁగి తొల్లిటిరతులు పెరచేఁచఁగాఁగదా
మునుప నే నతనికి మొక్క వలసె
చనవు శ్రీవేంకటేశ్వరుఁడియ్యఁగాఁగదా
తనివొంది కలసి సంతములు గావలసె
(||pallavi||)
ŏgaḍŏga ṭiṁka nāgu nuḍuvavalasĕ
mŏgamichchamāḍalagu mŏdalugŏnavalasĕ
(||ŏga||)
adanido nem̐ḍu ne naligi vuṁḍam̐gam̐gadā
vĕdam̐bŏṁdi madanunigi vĕṟavavalasĕ
tadi naṁtalo vibhum̐ni dalaboyam̐gām̐gadā
madim̐ garam̐gi nāmenu maṟabaṁdavalasĕ
(||ŏga||)
virahadābabu(mu?) vĕdavĕṭṭam̐ bŏralam̐gam̐gadā
garimanāsĕluladom̐ gasaravalasĕ
jarasi nādamagamulu salamugŏnam̐gām̐ gadā
sirulam̐ badi paṁtamulu sĕlliṁchavalĕsĕ
(||ŏga||)
pĕnam̐gi tŏlliḍiradulu pĕrasem̐sam̐gām̐gadā
munuba ne nadanigi mŏkka valasĕ
sanavu śhrīveṁkaḍeśhvarum̐ḍiyyam̐gām̐gadā
tanivŏṁdi kalasi saṁtamulu gāvalasĕ