(॥పల్లవి॥)
ఒకటిపై నొకటి నీ వుపాయాలు
వెకలి నీ విద్యలెల్ల వెల్లవిరి గావా
(॥ఒక॥)
సందడి నాచేఇ ముట్టి సరసాలాడేకొరకే
పందెమాడవచ్చేవు పలుమారును
మందలించి నాచేత మాటలాడించవలసి
అందపుఁగత లడిగే వది నే నెఱఁగనా
(॥ఒక॥)
యేరా నాకుచగిరు లిటు ముట్టేయందుకుంగా
హారములు చిక్కుదీసే పది మేలురా
గోరికొన దాఁకించేకొరకుఁగా చెక్కుముట్టి
యీరీతి వేఁడుకొనే విన్నియుఁ దెలిసెరా
(॥ఒక॥)
యీకడ నన్నుఁ గూడేఇందుకుఁగా నింతసేసి
యేకతమాడేనంటా నెనసితివి
పైకొని శ్రీవేంకటేశ బడివాయకుండా న-
న్నాకుమడిచిమ్మనేవు అవురా నీవు
(||pallavi||)
ŏgaḍibai nŏgaḍi nī vubāyālu
vĕgali nī vidyalĕlla vĕllaviri gāvā
(||ŏga||)
saṁdaḍi nāsei muṭṭi sarasālāḍegŏrage
paṁdĕmāḍavachchevu palumārunu
maṁdaliṁchi nāseda māḍalāḍiṁchavalasi
aṁdabum̐gada laḍige vadi ne nĕṟam̐ganā
(||ŏga||)
yerā nāgusagiru liḍu muṭṭeyaṁduguṁgā
hāramulu sikkudīse padi melurā
gorigŏna dām̐kiṁchegŏragum̐gā sĕkkumuṭṭi
yīrīdi vem̐ḍugŏne vinniyum̐ dĕlisĕrā
(||ŏga||)
yīgaḍa nannum̐ gūḍeiṁdugum̐gā niṁtasesi
yegadamāḍenaṁṭā nĕnasidivi
paigŏni śhrīveṁkaḍeśha baḍivāyaguṁḍā na-
nnāgumaḍisimmanevu avurā nīvu