Ogadibai nogadela vodde yimta

ఒకటిపై నొకటేల వొద్దే యింత
Language

(॥పల్లవి॥)
ఒకటిపై నొకటేల వొద్దే యింత
చికురము వీడెఁ జాలు సిగ్గులు నీకేలే

(॥॥)
తియ్యనిపెదవినోటఁ దెగి వెంగెమాడఁబోతే
వొయ్యనే కారములయ్యీ వొద్దే యింత
పయ్యదలోని జక్కవపక్షు లడిచేయట్టి-
కయ్యము చాలదా నాతో కయ్యము నీకేలే

(॥॥)
తెల్లని కన్నుల నీవు దిష్టించి చూడఁబోతే
వుల్లసపు చేఁగదేరీ వొద్దే యింత
చెల్లఁబో నడపుకరి సింహము నడుము నీమై
పెల్లున బెనఁగీ నాతోఁ బెనఁగ నీకేలే

(॥॥)
మెత్తని తామెరచేత మీఱి నన్ను దొబ్బఁబోతె
వొత్తి మరునమ్ములయ్యీ వొద్దే యింత
యెత్తి నిన్ను శ్రీవేంకటేశుఁడ నేఁగలసితి
పొత్తులరతులు చెల్లె పూఁపనవ్వు లేలే

(||pallavi||)
ŏgaḍibai nŏgaḍela vŏdde yiṁta
siguramu vīḍĕm̐ jālu siggulu nīgele

(||||)
tiyyanibĕdavinoḍam̐ dĕgi vĕṁgĕmāḍam̐bode
vŏyyane kāramulayyī vŏdde yiṁta
payyadaloni jakkavabakṣhu laḍiseyaṭṭi-
kayyamu sāladā nādo kayyamu nīgele

(||||)
tĕllani kannula nīvu diṣhṭiṁchi sūḍam̐bode
vullasabu sem̐gaderī vŏdde yiṁta
sĕllam̐bo naḍabugari siṁhamu naḍumu nīmai
pĕlluna bĕnam̐gī nādom̐ bĕnam̐ga nīgele

(||||)
mĕttani tāmĕraseda mīṟi nannu dŏbbam̐bodĕ
vŏtti marunammulayyī vŏdde yiṁta
yĕtti ninnu śhrīveṁkaḍeśhum̐ḍa nem̐galasidi
pŏttularadulu sĕllĕ pūm̐panavvu lele