ఒకటిపై కాఁతాళము వొకటిపైఁ జూపనేల
(॥పల్లవి॥)
ఒకటిపై కాఁతాళము వొకటిపైఁ జూపనేల
వెకలివై నెచ్చెలుల విన్నపాలు వినవే
(॥ఒట్టి॥)
కొమ్మ నీవు నీ పతినే కొసరఁగవలెఁగాక
తుమ్మిదల నేఁటికి దూరేవే నీవు
చిమ్ముచు నీ విట్టె బత్తిసేసి చూపుదువుగాక
అమ్మరో మరునినేల ఆడిపోసుకొనేవే
(॥ఒట్టి॥)
వేడుక నాతని నింకా వేఁడుకొందువుగాక
కూడగొట్టు గాలినేల కోపగించేవే
వీడె మిచ్చి చెక్కు నొక్కి వేఁడుకొనవలెఁగాక
నీడనున్న కొవిలను నెరుసులే లెంచేవే
(॥ఒట్టి॥)
గట్టిగా శ్రీవేంకటేశుఁ గాఁగిట నింతువుగాక
గుట్టుతో చందరునేల గుంపించేవే
నెట్టన ని న్నితఁ డేలె నెమ్మది నుందువుగాక
వొట్టి వసంతుపై నేల వొలవేసేవే
(||pallavi||)
ŏgaḍibai kām̐tāḽamu vŏgaḍibaim̐ jūbanela
vĕgalivai nĕchchĕlula vinnabālu vinave
(||ŏṭṭi||)
kŏmma nīvu nī padine kŏsaram̐gavalĕm̐gāga
tummidala nem̐ṭigi dūreve nīvu
simmusu nī viṭṭĕ battisesi sūbuduvugāga
ammaro maruninela āḍibosugŏneve
(||ŏṭṭi||)
veḍuga nādani niṁkā vem̐ḍugŏṁduvugāga
kūḍagŏṭṭu gālinela kobagiṁcheve
vīḍĕ michchi sĕkku nŏkki vem̐ḍugŏnavalĕm̐gāga
nīḍanunna kŏvilanu nĕrusule lĕṁcheve
(||ŏṭṭi||)
gaṭṭigā śhrīveṁkaḍeśhum̐ gām̐giḍa niṁtuvugāga
guṭṭudo saṁdarunela guṁpiṁcheve
nĕṭṭana ni nnidam̐ ḍelĕ nĕmmadi nuṁduvugāga
vŏṭṭi vasaṁtubai nela vŏlaveseve