ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
(॥పల్లవి॥)
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు
(॥ఒక॥)
తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు
పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే
తనుఁ గానరాదు జీవతత్వము గాన
(॥ఒక॥)
దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు
భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే
దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన
(॥ఒక॥)
సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు
అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
శరణాగతియె సర్వసాధనము గాన
(||pallavi||)
ŏgaḍi sujñānamu ŏgaḍi ajñānamu
pragaḍiṁchi vŏgaḍi sebaṭṭaro vivegulu
(||ŏga||)
tanum̐ dalasugŏṁṭenu takkina dehabhogālu
panigirāvu avi prakṛti gāna
ghanamaina logabhogamulado lolum̐ḍaide
tanum̐ gānarādu jīvadatvamu gāna
(||ŏga||)
daivamu nĕṟim̐gidenu tana kāmyagaryamulu
bhāviṁchi maṟavavalĕ baṁdhālu gāna
kāviṁcheḍi tana kāmyagarmālam̐ gaṭṭuvaḍide
daivamu lonu gām̐ḍu svadaṁtrum̐ḍu gāna
(||ŏga||)
sarimokṣhamu goride svargamu tĕruvu gādu
araya svargamu tĕru vala mokṣhānagu
paraga nalamelmaṁgabadi śhrīveṁkaḍeśhuni
śharaṇāgadiyĕ sarvasādhanamu gāna