Ogadi kogadigini vorabaaya | yee

ఒకటి కొకటికిని వొరపాయ । యీ
Language

(॥పల్లవి॥)
ఒకటి కొకటికిని వొరపాయ । యీ-
వెకలి జవ్వనము విఁ(విం?)తైనట్లు

(॥ఒక॥)
సతితురుములోనిశామంతివిరులు
రతిసమయంబున రాలఁగను
తతిఁ జెమటవాన తగఁ గురియుటకును
గతిఁ జిలుకలాడుగరిమెలు దోఁచె

(॥ఒక॥)
రమణికుచంబులు రతిబందంబున
క్రమమున సారెకుఁ గదలఁగను
కమలపు మొగ్గలు కంతుసమరమున
జమళి నదరుసూచనవిధమాయ

(॥ఒక॥)
పొలఁతిమేనిపైఁ బూసినగందము
కలయికఁ గరఁగుచుఁ గారఁగను
యెలమి శ్రీవేంకటేశు మోహరస-
మొలుగులు వారుచు నుండినరీతి

(||pallavi||)
ŏgaḍi kŏgaḍigini vŏrabāya | yī-
vĕgali javvanamu vim̐(viṁ?)tainaṭlu

(||ŏga||)
sadidurumuloniśhāmaṁtivirulu
radisamayaṁbuna rālam̐ganu
tadim̐ jĕmaḍavāna tagam̐ guriyuḍagunu
gadim̐ jilugalāḍugarimĕlu dom̐sĕ

(||ŏga||)
ramaṇigusaṁbulu radibaṁdaṁbuna
kramamuna sārĕgum̐ gadalam̐ganu
kamalabu mŏggalu kaṁtusamaramuna
jamaḽi nadarusūsanavidhamāya

(||ŏga||)
pŏlam̐timenibaim̐ būsinagaṁdamu
kalayigam̐ garam̐gusum̐ gāram̐ganu
yĕlami śhrīveṁkaḍeśhu moharasa-
mŏlugulu vārusu nuṁḍinarīdi