ఒకటి కొకటికి లంకె వువిదలకుఁ బతులకును
(॥పల్లవి॥)
ఒకటి కొకటికి లంకె వువిదలకుఁ బతులకును
మొకమిచ్చలనుఁ గలసి మొనయవలెఁగాని
(॥ఒక॥)
పెలగొన్న చుట్టరికము ప్రియములకుఁ గారణము
ననుపులకుఁ గడలేని నవ్వులు గారణము
తనవోనియాసలకు తలపోఁతఁగారణము
మనసు లెనయుటకు సమ్మతులు గారణము
(॥ఒక॥)
మరిగి తగులుటకు నెడమాట లవి గారణము
సరసముల కొడఁబడినచనవు గారణము
సురతములవాడికకు సొలపు లిటు గారణము
గరిమఁ జెనకులకు తమకములు గారణము
(॥ఒక॥)
సంతతపు వేడుకకు జవ్వనము గారణము
మంతనపుఁ గూటమికి మనసు గారణము
ఇంతిరో శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
చెంత మీకిద్దరికి చెలిమి గారణము
(||pallavi||)
ŏgaḍi kŏgaḍigi laṁkĕ vuvidalagum̐ badulagunu
mŏgamichchalanum̐ galasi mŏnayavalĕm̐gāni
(||ŏga||)
pĕlagŏnna suṭṭarigamu priyamulagum̐ gāraṇamu
nanubulagum̐ gaḍaleni navvulu gāraṇamu
tanavoniyāsalagu talabom̐tam̐gāraṇamu
manasu lĕnayuḍagu sammadulu gāraṇamu
(||ŏga||)
marigi taguluḍagu nĕḍamāḍa lavi gāraṇamu
sarasamula kŏḍam̐baḍinasanavu gāraṇamu
suradamulavāḍigagu sŏlabu liḍu gāraṇamu
garimam̐ jĕnagulagu tamagamulu gāraṇamu
(||ŏga||)
saṁtadabu veḍugagu javvanamu gāraṇamu
maṁtanabum̐ gūḍamigi manasu gāraṇamu
iṁtiro śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
sĕṁta mīgiddarigi sĕlimi gāraṇamu