Ogadi kogadi lamkeyi vumdu nardhamula kella

ఒకటి కొకటి లంకెయి వుండు నర్థముల కెల్ల
Language

(॥పల్లవి॥)
ఒకటి కొకటి లంకెయి వుండు నర్థముల కెల్ల
సకలమున కితరసంగమే కారణము

(॥ఒకటి॥)
కోరు నేదైనా తనకు కొసరుచు నీ మనసు
కోరినది రాకుండితే కోపము వుట్టు
ఆరయఁ గోపమువల్ల నజ్ఞానము ముంచుకొను
పోరచి నజ్ఞానమునఁ బూర్వ మెల్లా మఱచు

(॥ఒకటి॥)
చూచు నేదియైనాను సొరిదిఁ గన్నులెదుట
చూచినంతటిలోనే సుడిఁబెట్టు నాసలు
యేచిన యాసలవల్ల యేమియైనా వేఁడఁజూచు
యాచకము కడు దైన్య మందఁజేయు నపుడు

(॥ఒకటి॥)
సేసు నూర కేమియైనా చెలరేఁగి కర్మములు
సేసిన యాకర్మములు చేరి జన్మము నెత్తించు
వేసారక జన్మము శ్రీవేంకటేశుఁ గొలిపించు
రాసి కెక్క నితఁడే రక్షించు జీవుని

(||pallavi||)
ŏgaḍi kŏgaḍi laṁkĕyi vuṁḍu nardhamula kĕlla
sagalamuna kidarasaṁgame kāraṇamu

(||ŏgaḍi||)
koru nedainā tanagu kŏsarusu nī manasu
korinadi rāguṁḍide kobamu vuṭṭu
ārayam̐ gobamuvalla najñānamu muṁchugŏnu
porasi najñānamunam̐ būrva mĕllā maṟasu

(||ŏgaḍi||)
sūsu nediyainānu sŏridim̐ gannulĕduḍa
sūsinaṁtaḍilone suḍim̐bĕṭṭu nāsalu
yesina yāsalavalla yemiyainā vem̐ḍam̐jūsu
yāsagamu kaḍu dainya maṁdam̐jeyu nabuḍu

(||ŏgaḍi||)
sesu nūra kemiyainā sĕlarem̐gi karmamulu
sesina yāgarmamulu seri janmamu nĕttiṁchu
vesāraga janmamu śhrīveṁkaḍeśhum̐ gŏlibiṁchu
rāsi kĕkka nidam̐ḍe rakṣhiṁchu jīvuni