Ogadi kogadi lamke vollananna viduvadu

ఒకటి కొకటి లంకె వొల్లనన్న విడువదు
Language

(॥పల్లవి॥)
ఒకటి కొకటి లంకె వొల్లనన్న విడువదు
వెకలి వలపు లిట్టె వెంటనే తగులునే

(॥ఒక॥)
మాటలాడి నప్పుడే మర్మములు రేఁగును
కాటుకకన్నులచూవు కాంక్ష రేఁచును
వాటపు సెలవినవ్వు వదలించు ధైర్యము
యీటునఁజేసే పొందు విటువంటివే

(॥ఒక॥)
తల వంచుకొంటేను తరితీపు లుప్పతిలు
తలపోఁతసిగ్గులు తమి వుట్టించు
వెల లేనివినుకలి వేడుకలు పచరించు
యెలమి నాకోరిక కేది గడగురుతే

(॥ఒక॥)
తనువులు సోఁకితేను తగిలించు వావులు
పెనఁగితే మీఁదమీఁదఁ బ్రియము వుట్టు
యెనసె శ్రీ వేంకటేశుఁ డే నలమేల్మంగను
యినుమడించె భోగము యెంతైనఁ గలదే

(||pallavi||)
ŏgaḍi kŏgaḍi laṁkĕ vŏllananna viḍuvadu
vĕgali valabu liṭṭĕ vĕṁṭane tagulune

(||ŏga||)
māḍalāḍi nappuḍe marmamulu rem̐gunu
kāḍugagannulasūvu kāṁkṣha rem̐sunu
vāḍabu sĕlavinavvu vadaliṁchu dhairyamu
yīḍunam̐jese pŏṁdu viḍuvaṁṭive

(||ŏga||)
tala vaṁchugŏṁṭenu taridību luppadilu
talabom̐tasiggulu tami vuṭṭiṁchu
vĕla lenivinugali veḍugalu pasariṁchu
yĕlami nāgoriga kedi gaḍagurude

(||ŏga||)
tanuvulu som̐kidenu tagiliṁchu vāvulu
pĕnam̐gide mīm̐damīm̐dam̐ briyamu vuṭṭu
yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍe nalamelmaṁganu
yinumaḍiṁchĕ bhogamu yĕṁtainam̐ galade